భారీ రేటుకు .. మహేష్ సినిమా సాటిలైట్ రైట్స్ ?

Wednesday, June 6th, 2018, 09:52:31 AM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఇటీవలే విడుదలైన భరత్ అనే నేను సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగులో దాదాపు 200 కోట్ల భారీ వసూళ్లు అందుకున్న ఈ సినిమా అటు తమిళంలో డబ్ చేస్తే అక్కడ కూడా భారీగానే వసూళ్లు దక్కాయి. తాజాగా ఈ సినిమా హిందీ సాటిలైట్ హక్కులు భారీ రేటుకు అమ్ముడై షాకిస్తున్నాయి. ఓ ప్రముఖ టివి ఛానల్ ఏకంగా 22 కోట్లకు ఈ హక్కులు తీసుకుందట. నిజంగా ఇది భారీ రేట్ అని చెప్పాలి. ఇప్పటికే తెలుగు సినిమాలకు హిందీ సాటిలైట్ హక్కుల విషయంలో మంచి క్రేజ్ ఉంది. పలువురు హీరోలు నటించిన సినిమాలు భారీ రేటుకు ఈ హిందీ సాటిలైట్ హక్కులు తీసుకోవడం తెలిసిందే. ఈ లిస్ట్ లో మహేష్, అల్లు అర్జున్ లు ముందు వరుసలో ఉన్నారు. మహేష్ తన 25వ సినిమా ఈ నెల రెండో వారంలో సెట్స్ పైకి రానున్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.

  •  
  •  
  •  
  •  

Comments