హార్దిక్ పాండ్యపై క్రికెట్ అభిమానుల ఆగ్రహం….. మ్యాటర్ ఏంటంటే?

Monday, September 3rd, 2018, 09:49:20 PM IST

భారతదేశంలో క్రికెట్ ని ఆరాధించేవారు మిగతా దేశాలతో పోలిస్తే ఒకింత ఎక్కువేనని చెప్పుకోవాలి. ఇక్కడ సినీతారలను మరియు క్రికెటర్లను అమితంగా ప్రేమిస్తుంటారు వారి అభిమానులు. వారు ఒకవేళ ఎప్పుడైనా గర్వపడే పనిచేస్తే వారిని ఆకాశానికి ఎత్తేసే అభిమానులు, అదే వారిపై ఒకసారి నెగటివ్ ఇంపాక్ట్ పడితే మాత్రం వారిని అదఃపాతాళానికి తొక్కడానికి కూడా సిద్ధంగా వుంటారు. అలా నేడు క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురైన టీం ఇండియా యువ క్రికెటర్ హార్దిక్ పాండ్య వారి నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. విషయం ఏమిటంటే, ఇంగ్లాండ్ తో ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్ మ్యాచుల్లో తన పేలవమైన ప్రదర్శనతో పాండ్య ఇంగ్లీష్ క్రీడాకారులకు మాత్రం పండుగ చేస్తున్నాడని మండిపడుతున్నారు.

అతడు బౌలింగ్ కు దిగితే స్టోక్స్ కు, బ్యాటింగ్ కు దిగితే వోక్స్ కు పండుగే పండుగని, ఇంగ్లాండ్ జట్టులో బెన్‌స్టోక్స్‌, క్రిస్‌ వోక్స్‌, శామ్ కురన్, మెయిన్ అలీ వంటి ఆల్ రౌండర్లు ఉంటే మన జట్టులో మాత్రం మంచి మోడల్ గా పనికివచ్చే ఆల్ రౌండర్ ఉన్నాడంటూ ఎద్దేవా చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అతడు ఆడేది తక్కువ బిల్డప్ ఇచ్చేది ఎక్కువని, అతడు కేవలం ఒక ఫ్యాషన్ ఐకాన్ మాత్రమే, అసలు టీమ్ ఇండియాలో అతడి స్థానమేంటో చెప్పాలని బిసిసిఐ ని వారు డిమాండ్ చేస్తూ సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా పాండ్యను ట్రోల్ చేస్తున్నారు. అసలు ఏమి చేతకాని ఇటువంటి అతగాడిని పదే పదే ఎందుకు టీమ్లోకి తీసుకుంటున్నారని బోర్డు సభ్యులను వారు ప్రశ్నిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇంగ్లీష్ జట్టుపై పాండ్య పేలవమైన ప్రదర్శన ఇండియన్ క్రికెట్ ఫాన్స్ కు ఎంత ఆగ్రహం తెప్పించిందో అర్ధం చేసుకోవచ్చు….

  •  
  •  
  •  
  •  

Comments