బాలయ్య డైలాగ్ చెప్పిన క్రికెటర్!

Monday, April 23rd, 2018, 04:30:31 PM IST

నందమూరి బాలకృష్ణ డైలాగ్ చెబితే ఎలా ఉంటుందో తెలుగు సినీ ప్రేక్షకులకు తెలిసిందే. ఆయన నుంచి ఏ సినిమా వచ్చినా కూడా అందులో చెప్పుకోదగ్గ డైలాగ్స్ ఫుల్ గా ఉంటాయి. శ్రీమన్నారాయణ సినిమాలో బాలయ్య చెప్పిన ఒక డైలాగ్ ఎంతగా ఫెమస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ అనే డైలాగ్ సోషల్ మీడియాలో ఇప్పటికి వైరల్ అవుతోంది. ఇక ఆ డైలాగ్ ను ఒక విదేశీ ఆటగాడు చెప్పడంతో ఆ వీడియో కూడా వైరల్ అవుతోంది.

హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ లో ఉన్న ఇంగ్లాండ్ ప్లేయర్స్ అలెక్స్ హేల్స్ బాలయ్య డైలాగును ఆపకుండా చెప్పేశాడు. సన్ రైజర్స్ జట్టు నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా అలెక్స్ ఆ డైలాగ్ చెప్పాడు. అది చూసి తోటి ఆటగాళ్లు క్లాప్స్ కొట్టారు. అలెక్స్ హేల్స్ ను మొదట ఐపీఎల్ వేలంలో ఎవరు తీసుకోలేదు. అయితే బాల్ టాంపరింగ్‌ కారణంగా డేవిడ్ వార్నర్ ఏడాదిపాటు నిషేధం ఎదురుకున్నందుకు అతని స్థానంలో హేల్స్ ను కొనుగోలు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments