ట్రాన్స్ జెండర్ లా కనిపించిన క్రికెటర్ గంభీర్!

Friday, September 14th, 2018, 05:08:12 PM IST

టీమిండియా సీనియర్ క్రికెటర్ గా జట్టుకు మంచి సేవలను అందించిన గంభీర్ సామజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇకపోతీ రీసెంట్ గా ఆయనకు సంబందించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దుప్పట్ట కొంగు కప్పుకొని నుదుట పెద్ద బొట్టుతో కనిపించాడు. ఒక ట్రాన్స్ జెండర్ గా ఆయన ఇచ్చిన స్టిల్ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఇది కావాలని ఎవరో ఎడిటి చేశారని కొన్ని రూమర్స్ వచ్చినప్పటికీ చివరికి నిజమే అని తేలింది.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పును ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు గంభీర్ కూడా తన మద్దతును ప్రకటించారు. అంతే కాకుండా గతంలో వారితో రాఖీ కూడా కట్టించుకొని సోదర భావాన్ని నెలకొల్పాడు. ఇక ఆ ఫొటో విషయానికి వస్తే కోర్టు తీర్పు నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్స్‌ కమిటీ నిర్వహించిన హిజ్రా హబ్బా ఈవెంట్స్ లో గౌతమ్ స్పెషల్ గా దర్శనమిచ్చాడు. అందుకు సంబందించిన కార్యక్రమాల్లో పాల్గొనాలంటే ఎవరైనా సరే మగవారు బొట్టు, దుప్పట్టతో రావాలి. ఇక ఆడవారు మీసాలు పెట్టుకోని తీరాలి. అందులో భాగంగా గంభీర్ ఈ విధంగా దర్శనం ఇచ్చాడు. గంభీర్ అలా రెడీ అవ్వడానికి ఒక ట్రాన్స్ జెండర్ అతనికి సాయం చేసింది. అది సంగతి!

  •  
  •  
  •  
  •  

Comments