మరో లక్జరీ కారు కొన్న విరాట్ కోహ్లీ… ఇంతకీ రేటెంతో తెలుసా..?

Friday, March 30th, 2018, 01:34:06 PM IST

సాధారణంగా సెలబ్రిటీలకు కార్లంటే పిచ్చి బాగానే ఉంటుంది. కానీ కోహ్లీకి అందరికంటే కాసింత ఎక్కువగానే ఉంది. లగ్జరీ కార్లంటే విరాట్ కోహ్లికి ఎంతిష్టమో తెలిసిందే. అందులోనూ తాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆడి కార్లంటే అతనికి మరీ ఇష్టం. ఇప్పటికే ఈ జర్మన్ లగ్జరీ కార్ మేకర్‌కు చెందిన ఐదు కార్లు కోహ్లి దగ్గర ఉన్నాయి. ఆడి ఆర్8 ఎల్‌ఎంఎక్స్ లిమిటెడ్ ఎడిషన్, ఆడి ఆర్8 వీ10, ఆడి ఏ8ఎల్ డబ్ల్యూ12 క్వాట్రో, ఆడి ఎస్6, ఆడి క్యూ7లతోపాటు టొయొటా ఫార్చునర్, రెనాల్ట్ డస్టర్ కార్లు కోహ్లి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు వీటికి బెంట్లీ కాంటినెంటల్ జీటీ కూడా తోడైంది. ఈ కారు విలువ సుమారు 4 నుంచి 5 కోట్ల వరకు ఉంటుందట. ఈ కొత్త కారును కొన్న కోహ్లి.. తన సోదరుడు వికాస్ కోహ్లి పేరు మీద దీనిని రిజిస్టర్ చేయించాడు. బెంట్లీ కాంటినెంటల్ జీటీ ఈ మధ్యే ఇండియాలో లాంచ్ అయింది. ఈ కార్లను ఇప్పటికే టీమిండియా క్రికెటర్లు సెహ్వాగ్, యువరాజ్ కొనుగోలు చేశారు.