షమీ భార్య హసీన్ : నాది కూడా కతువా రేప్ కేసు లాంటిదే…

Thursday, April 26th, 2018, 11:30:06 PM IST

క్రికెటర్ మహ్మద్ షమి భార్య హసీన్ జహాన్ తన కేసును కతువా రేప్ కేసుతో పోల్చుకుంది. కతువా రేప్‌కు వ్యతిరేకంగా కోల్‌కతాలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆమె.. ఈ వ్యాఖ్యలు చేసింది. నాది కూడా కతువా రేప్ కేస్‌లాంటిదే.. కాకపోతే నేనింకా బతికే ఉన్నాను.. అదొక్కటే తేడా అంటూ ఆమె కంటతడి పెట్టింది. కతువా ఘటన బాధ్యులైన వాళ్లను కచ్చితంగా శిక్షించాల్సిందేనని జహాన్ డిమాండ్ చేసింది. తనను చంపడానికి షమి కుటుంబం ఎలాంటి ప్లాన్ వేసిందో ఈ సందర్భంగా ఆమె వెల్లడించింది.

నన్ను రేప్ చేసి, చంపి, నా శవాన్ని అడవిలో పడేయడానికి ప్లాన్ చేశారు. రెండు నెలలుగా వీటన్నంటితో నేను పోరాడుతున్నాను అని ఆమె చెప్పింది. అయితే ఆమె తాజా ఆరోపణలపై షమి లేదా అతని కుటుంబ సభ్యులు స్పందించలేదు. ఇప్పటికే షమి, అతని కుటుంబ సభ్యులపై గృహ హింస కేసు పెట్టిన ఆమె.. షమి నుంచి నెలకు రూ.10 లక్షల భరణం ఇప్పించాలని కోరిన విషయం తెలిసిందే. ఇప్పటికే తన కేసు విషయమై వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా జహాన్ కలిసింది.

  •  
  •  
  •  
  •  

Comments