బౌలర్ షమీకి అక్రమ సంబంధాలు.. షమీ భార్య షాకింగ్ కామెంట్స్!

Wednesday, March 7th, 2018, 02:26:18 PM IST

ఇండియన్ క్రికెట్ టీమ్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ పై ఎవరు ఉహించనిక్ విధంగా సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా షమీ భార్య హాసిన్ మీడియా ముందుకు వచ్చి షమిపై ఆరోపణలు చేయడంతో దేశమంతటా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 2013లో పెళ్లి చేసుకున్న వారిద్దరికీ గత కొంత కాలంగా కొన్ని విషయాల్లో వివాదాలు చెలరేగుతున్నాయి. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే షమీ పై అతని భార్య అక్రమ సంబంధాలు ఉన్నట్లు తెలిపింది.

పాకిస్తాన్ యువతితో పెళ్లయినట్లు అలాగే ఇతర మహిళలతో కూడా సంబంధాలు ఉన్నట్లు హాసిన్ చెప్పింది. అంతే కాకుండా కుల్దీప్ అనే యువకుడు షమీకి అమ్మాయిలను సప్లై చేస్తుంటాడు. భారత క్రికెట్ ఎక్కడికి వెళ్లినా అదే తంతు.. బిసిసిఐ కి విషయం తెలిసినా కూడా పట్టించుకోలేదు. రీసెంట్ గా దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ అనంతరం షమీ అమ్మాయి కోసం పాకిస్తాన్ కు వెళ్లాడు. షమీకి వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నట్లు ఆయన మొబైల్ చూడగానే తెలిసింది. దీంతో నన్ను వేధింపులకు గురి చేస్తున్నారని షమీ భార్య వివరించింది. అంతే కాకుండా అతని కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉంధని ఆమె తెలిపింది. అయితే ఈ ఆరోపణలను షమీ ఖండించాడు. తన కెరీర్ పై దెబ్బ కొట్టేందుకే ఇలా కుట్రలు పన్నుతున్నట్లు తెలిపాడు.