కత్తి మహేష్ పై క్రిమినల్ కేసు!

Saturday, September 8th, 2018, 11:50:39 AM IST

కొన్ని వారాల క్రితం హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శ్రీ రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అందుకుగాను నగరబహిష్కరను గురవ్వడం వివాదం నెలకొన్న రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. అయితే ఘటన గురించి అందరూ మర్చిపోతున్న వేళ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్‌ పై క్రిమినల్ కేసు నమోదవ్వడం మరోసారి వైరల్ గా మారింది. బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైనట్లు వార్తలు వెలువడుతున్నాయి.

జూన్‌ 29న ప్రముఖ తెలుగు వార్తా ఛానెల్‌ లో నిర్వహించిన ఒక చర్చావేదికలో కత్తి మహేష్ పాల్గొన్నాడు. హిందువులు భక్తితో కొలిచే రామాయణంపై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యానించారని ఆ రోజే అదే రోజు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో రహ్మత్‌నగర్‌కు చెందిన గడ్డం శ్రీధర్‌ ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదుపై న్యాయ సలహాల అనంతరం పోలీసులు కత్తి మహేష్‌పై ఐపీసీ సెక్షన్‌ 295(ఏ), 505(2) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం అందుకు సంబందించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  •  
  •  
  •  
  •  

Comments