2.0 మూవీ సెన్షేష‌న్.. రిప్ ఆల్ బాక్సాఫీస్ రికార్డ్స్‌..!

Thursday, November 29th, 2018, 01:35:32 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్-శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చి హ్యాట్రిక్ మూవీ 2.0. ఈరోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం ప్రీమియ‌ర్స్ కంప్లీట్ అవ‌డంతో టాక్ బ‌య‌ట‌కి వ‌చ్చింది. సినిమా చూసిన ప్రేక్ష‌కులు సూపర్ హిట్ అని తేల్చేస్తున్నారు. చిట్టి – ప‌క్షిరాజు మధ్య వచ్చే సన్నివేశాలు అద్భ‌తంగా ఉన్నాయ‌ని, రజనీ – అక్షయ్‌ల నటన ఈ సినిమాలో హైలెట్ అని, విజువ‌ల్ వండ‌ర్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయని ప్రేక్ష‌కులు కితాబు ఇస్తున్నారు.

ఇక‌ డైరెక్ట‌ర్ శంక‌ర్ తాను చెప్పాల్సిన మెసేజ్‌ను, అందరికి అర్ధమయ్యే రీతిలో తెర‌కెక్కించి సక్సెస్ అయ్యాడని, నిర్మాత‌లు తాను ఖర్చు పెట్టించిన ప్రతి రూపాయి తెరపై కనిపిస్తుందని, ఒక సున్నిత‌మైన క‌థకి, అద్భుత‌మైన సాంకేతిక హంగులు జోడించి, వావ్ అనిపించేలా తెర‌కెక్కించార‌ని ప్రేక్ష‌కులు తేల్చేశారు. అయితే తాజాగా ఈ చిత్రం పై త‌మిళ సినీ విమ‌ర్శ‌కుడు ర‌మేష్ బాలా స్పందించారు. 2.0 ఓ అద్భుత‌మైన సినిమా అని, శంకర్ మరోసారి తన విజన్ ఉన్న మాస్టర్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడని..ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న బాక్సాఫీస్ రికార్డుల‌న్నీ 2.0 తుడిచివేయ‌డం ఖాయ‌మ‌ని, బాక్సాఫీస్ ఆల్ రికార్డ్స్ రిప్ అంటూ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.