టీడీపీలో టెన్షన్ : కోడి కత్తి కేసులో కీలక మలుపు..!

Friday, January 11th, 2019, 10:15:20 AM IST

వైసీపీ అధినేత జగన్ పై జరిగిన హత్యాయత్న దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది, ఇటీవల కేసును ఎన్ ఐ ఏ బృందానికి అప్పగించిన కోర్ట్ ఇప్పుడు నిందితుడు శ్రీనివాస్ ను ఎన్ ఐ ఏకు అప్పగించాలని ఆదేశించింది. ఇదే ఇప్పుడు టీడీపీలో టెన్షన్ కు కారణం అవుతుంది. మొదటి నుండి టీడీపీ కేసును యెన్ ఎన్ ఐ ఏ కు అప్పగించటాన్ని వ్యతిరేకిస్తూ వచ్చింది, అందుకే విచారణ నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఎన్ ఐ ఏ కు పోలీసులు కూడా సహకరించకుండా చేసింది ప్రభుత్వం. దీంతో పోలీసులు సహకరించటం లేదంటూ పిటిషన్ వేసిన ఎన్ ఐ ఏ, నిందితుడు శ్రీనివాస్ ను తమ కస్టడీకి అప్పగించాలని కూడా కోరింది. ఇప్పటి వరకు, ఈ కేసులో శ్రీనివాస్ పాత్రదారి మాత్రమే అని, ప్రభుత్వమే దీని వెనక సూత్రదారి అని ఆరోపిస్తోంది. టీడీపీ పడుతున్న టెన్షన్ చూస్తోంటే ఆ ఆరోపణలు నిజమేనేమో అనిపిస్తోంది.

నిందితుడు శ్రీనివాస్ రాష్ట్ర పోలీసుల అదుపులో ఉన్నంత కాలం విచారణ ఏ మాత్రం ముందుకు సాగలేదు,ఈ కేసులో సూత్రదారులు ఎవరన్నది ఇంతవరకు తేలలేదు. కేసు రాష్ట్ర పరిధిలో ఉన్నంతకాలం అసలు విషయాలు బయటపడటం ఆలస్యమే అవుతుంది. ఇప్పుడు ఎన్ ఐ ఏ రంగంలోకి దిగింది కాబట్టి దీని వెనక సూత్రధారి ఎవరన్నది త్వరగా తెలిసే అవకాశం ఉంది. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న ఎన్ ఐ ఏ విచారణలో భాగంగా ఎయిర్పోర్ట్ లోని క్యాంటీన్ ఓనర్ హర్షవర్ధన్ ను కూడా విచారించే అవకాశం ఉంది, ఈ కేసులో అతని పాత్ర కూడా ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తమీద ఈ కేసులో తీగ లాగితే డొంక కదిలేలా ఉంది, మరి ఎవరెవరి పేర్లు బయటికొస్తాయో చూడాలి.