వైరల్ న్యూస్ : కన్నకూతుళ్ల పై తండ్రి పైశాచికత్వం…ఏమి చేసాడంటే?

Thursday, April 12th, 2018, 01:25:59 AM IST


బిడ్డలకి రక్షణ కల్పించవలసిన కన్న తండ్రి ఆ ఆడపిల్లల పాలిట కామపిశాచిలా వ్యవహరించి వారి నిండు జీవితాలని చేసిన ఒక ఉదంతం ప్రస్తుతం పెను సంచలనం రేపుతోంది. విషయం ఏమిటంటే ముంబైలోని వకోల ప్రాంతానికి చెందిన 42 ఏళ్ళ వ్యక్తి ఫ్యాషన్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ముగ్గురు కూతుళ్ళు, ఓ కొడుకు ఉన్నాడు. 17 ఏళ్ళ తన పెద్ద కూతురిపై గత రెండేళ్ళుగా పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఏడాది నవంబర్‌లో రెండో కూతురిపై కూడ అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.

అయితే ఈ విషయాన్ని పెద్ద కూతురు తల్లికి చెప్పింది. ఇంత కాలంగా పెద్ద కూతురును నిందితుడు భయబ్రాంతులకు గురిచేశాడు. రెండో కూతురిపై కూడ అత్యాచారయత్నానికి ప్రయత్నించడంతో పెద్ద కూతురు అసలు విషయాన్ని తల్లికి చెప్పింది. దీంతో ఆమె భర్తతో గొడవకు దిగింది. తనను ప్రశ్నించిందనే కోపంతో భార్య, పిల్లలను ఆ నిందితుడు ఇంటి నుండి బయటకు గెంటేశాడు. దీంతో నిందితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆశ్చర్యపోయిన ఆ ప్రాంతవాసులు, ఇటువంటి హేయమైన చర్యకు పాల్పడిన ఆ తండ్రిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments