క్యూబాలో కుప్పకూలిన విమానం!

Sunday, May 20th, 2018, 02:43:19 AM IST

కమ్యూనిస్టు దేశంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న క్యూబాలో ఘోర విమాన ప్రమాదం అందరిని షాక్ కి గురి చేసింది. దాదాపు 100 మందికి పైగా ప్రాణాలు గాలిలో కలిసిపోయినట్లు రకరకాల వార్తలు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఉదయం 11 గంటలకు బయలుదేరిన విమానం పైకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే క్యూబా అధ్యక్షుడు మిగ్యుఎల్‌ డియాజ్‌ కానెల్‌ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. జరగాల్సిన పనులను వేగవంతం చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసిన డియాజ్‌ కానెల్‌ అనంతరం మీడియా ముందుకు వచ్చి భావోద్వేగానికి లోనయ్యారు. చాలా మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. బోయ్‌రోస్‌ అనే ఈ విమానం హోల్గున్‌కు బయలుదేరుతుండగా శాంటియాగో డీ లావెగాస్‌ పరిసర ప్రాంతాల్లో ఉన్న పొలాల మధ్య కూలిపోయింది. 104 మంది ప్రయాణికులతో పాటు తొమ్మిది మంది సిబ్బంది అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments