ఆసక్తిరేపుతున్న కేసీఆర్, అఖిలేష్ భేటీ!

Thursday, May 3rd, 2018, 03:45:48 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో పార్టీని ముందుకి తీసుకెళ్లే విధంగా పావులు కదుపుతున్నారు. కేంద్రంలోని యుపిఎ, ఎన్డీయే లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో ఒక గుణాత్మక మార్పుకు శ్రీకారం చుడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయమై ఆయన పలు సార్లు ఢిల్లీ పర్యటనలు కూడా చేశారు. ఇటీవల ఈ అంశం విషయమై ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ని, జేడీఎస్ లీడర్ దేవెగౌడని, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ని, జార్ఖండ్ ముక్తి మోర్చా లీడర్ హేమంత్ సొరేన్ ని, ఛత్తీస్గఢ్ లీడర్ అజిత్ జోగి వంటి ప్రముఖ నేతలతో కూడా కలిసి చర్చించారు. అయితే ఇదే అంశంపై చర్చించేందుకు ఆయన నేడు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ని కలిశారు.

నేటి ఉదయం ప్రత్యేక విమానంలో బేగంపేట్ విమానాశ్రయానానికి చేరుకున్న అఖిలేష్ కు ఐటి మంత్రి కేటీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘన స్వాగతం పలికారు. అక్కడినుండి ఆయన ప్రగతి భావం చేరుకొని కేసీఆర్ తో తేనీటి విందులో పాల్గొని పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. మంచి ఆసక్తి రేపుతున్న వీరి భేటీలో, ప్రస్తుత దేశ రాజకీయాలు, ఫ్రంట్ ఏర్పాటు విషయమై చర్చలు జరిగినట్లు త్లెలుస్తోంది. అయితే కొందరు టిఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం అఖిలేష్ కేసీఆర్ ఫ్రంట్ ఏర్పాటుకు మద్దతు ఇస్తామన్నారని అంటున్నారు. అయితే ఈ విషయమై పార్టీ అధిష్టానం నుండి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉన్నట్లు తెలుస్తోంది……

  •  
  •  
  •  
  •  

Comments