శాపం పెడుతున్న మంత్రి గారు!

Monday, May 21st, 2018, 04:00:01 PM IST


ఉత్తర్ ప్రదేశ్ లోని సహెల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ చీఫ్, అలానే యుపి సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయిన ఓం ప్రకాష్ రాజ్భర్ మొదటి నుండి వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మంత్రిగా ప్రజల్లో ముద్ర వేయించుకున్నారు. ఎవరైనా ఆయన చెప్పిన మాటలు వినకపోయినా, లేక చెప్పిన పని చేయకపోయినా తనదైన శైలిలో శాపాలు పెడుతూ ఉండడం ఆయన అలవాటు. కాగా ఇటీవల యుపిలో మద్యపానం నిషేధానికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీ లో పాల్గొనడానికి వచ్చిన ఆయన ప్రత్యర్థులకు శాపనార్ధాలు పెట్టారు. ఎవరైనా తనకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించినా, తన అనుమతి లేకుండా ర్యాలీలో పాల్గొన్నా అటువంటి వారికి జాండీస్ సోకుతుందని ఆయన శపించారు.

అలానే నా మనుషులు వచ్చి పిలిస్తే వచ్చి నా ర్యాలీలో పాల్గొనాలి, కాదని ప్రత్యర్థుల ర్యాలీలో పాల్గొన్నారో, అటువంటి వారికి కూడా జాండీస్ సోకుతుందని, మళ్ళి తాను తిరిగి వచ్చి మందు ఇచ్చేదాకా ఆ వ్యాధి తగ్గదని అన్నారు. ఎప్పుడూ బిజెపి పై అలానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే ఓం ప్రకాష్ ఈ మోడీని టార్గెట్ చేసారు. యుపి ఎన్నికలప్పుడు మోడీ గుజరాత్ మోడల్ ను ఇక్కడ ప్రవేశ పెడతాను అన్నారు. మధ్య నిషేధం తో పాటు అయన చెప్పిన ఆ పని కూడా మోడీ చేసి చూపించాలని అన్నారు. ఎస్ సి, ఎస్ టి రిజర్వేషల అంశం పై కూడా బిజెపి మోసం చేసిందని ఆయన విమర్శించారు. కాగా ఓం ప్రకాష్ వ్యాఖ్యలు అలానే వుంటాయని, వాటిని పెద్దగా పట్టించుకోవలసిన అవసరం లేదని, స్థానిక బిజెపి నేతలు అంటున్నారు…..

  •  
  •  
  •  
  •  

Comments