టీడీపీతో తెగతెంపులు, త్వరలో వైసిపిలోకి కీలక నేత?

Wednesday, July 11th, 2018, 07:07:49 PM IST

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. అక్కడి ప్రధాన పార్టీల్లోని నాయకులు, ఇప్పటికే ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వారికీ సీట్లు దక్కే పార్టీలవైపు చూస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రధాన పార్టీల్లోని అభ్యర్థులు తాము రాబోయే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న పార్టీలవైపు దూకుతున్నారు. ఇక మరికొందరు రాబోయే రోజుల్లో సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నేడు నెల్లూరు జిల్లా లో మంచి పట్టున్న ఆనం సోదరుల్లో ఒకరైన ఆనం రామ్ నారాయణ రెడ్డి త్వరలో వైసీపీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆయన ఈ విషయమై జగన్ తో కూడా చరించారట. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఇంఛార్జిగా వున్న ఆనం, ఇటీవల తన సోదరుడు వివేకానంద రెడ్డి మరణం తర్వాత చాల వరకు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటున్నారు.

ఇటీవల ఆ పార్టీ తలపెట్టిన దళిత తేజం సభలో కూడా ఆయన భాగస్వామ్యం కూడా పెద్దగా కనిపించలేదట. అయితే అప్పటినుండి ఆయన పార్టీ మారె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్నీ గ్రహించిన టీడీపీ అధిష్టానం ఆయన పార్టీ నుండి బయటకి వెళ్లే ముందే ఆయన్ని పార్టీ నుండి తొలగించే విషయమై సమాలోచనలు చేస్తున్నట్లు చెపుతున్నారు. ఇక ఆయనతో పాటు వున్న పార్టీ ఉపాధ్యక్షలు, మండల పార్టీ అధ్యక్షులు సహా మరికొందరు అనుచరగణం పై కూడా అధిష్టానం వేటు వేయనుందట. అయితే ప్రస్తుతం ఈ విషయమై ఆనం ఇంకా తన స్పందనను బహిరంగపరచలేదని, మరికొద్ది రోజులు ఆగితే గాని అసలు విషయం బయటకు రాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments