డీ మార్ట్ లో రూ.2500 ఓచర్.. అంతా ఫెక్!

Tuesday, June 12th, 2018, 03:10:50 AM IST

ప్రస్తుతం సోషల్ మీడియాల్లో ఎలాంటి న్యూస్ లు వచ్చినా వాటిని నమ్మాలా వద్దా అనే సందేహాలు చాలా వస్తున్నాయి. నిజం అబద్దం అని తెలుసుకోకుండా చాలా మంది షేర్ చేస్తూన్నారు. దీంతో నిజాలు చెప్పినా నమ్మలేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని సార్లు అబద్దాలను నమ్మే వరకు వస్తోంది. రీసెంట్ గా అదే తరహాలో ఒక న్యూస్ అందరిని షాక్ కి గురి చేసింది. డీ మార్ట్ 17వ వార్షికోత్సవ సందర్బంగా 2500 రూపాయల షాపింగ్ ఓచర్ ను ఫ్రీ గా ఇస్తోందని ఫెస్ బుక్ లో వాట్సాప్ లో జోరుగా ప్రచారాలు సాగుతున్నాయి.

ఒక లింక్ క్లిక్ చేస్తే ఓచర్ మీ సొంతం అని చెప్పడంతో చాలా మంది నిర్దారించుకొండా ఆ లింక్ ను ఫార్వడ్ చేస్తున్నారు. ఇకపోతే ఫైనల్ గా డీ మార్ట్ యాజమాన్యం ఈ విషయంపై స్పందించింది. ఎలాంటి గిఫ్ట్ ఓచర్లు ఇవ్వడం లేదంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశారు. ఫార్వడ్ చేసే మెస్సేజ్ లను ఒకసారి పరిశీలింఛాలని క్లిక్ చేస్తే 20 మందికి పంపండి అని మెస్సేజ్ వస్తుంది. ఆ తరువాత ఎం ఉండదు. అలా చేయడం వల్ల హ్యాకర్స్ కి మీ డేటా ఇచ్చినట్లే అని నిఫుణులు హెచ్చరించారు.

  •  
  •  
  •  
  •  

Comments