బ్రేకింగ్: కాంగ్రెస్‌లోకి డీఎస్‌, ఆర్‌.కృష్ణ‌య్య‌

Friday, October 26th, 2018, 11:00:16 PM IST

ముంద‌స్తు ఎన్నిక‌ల వేళ జంపింగ్ జ‌పాంగ్‌ల వ్య‌వ‌హారం అంత‌కంత‌కు వేడెక్క‌డం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది. అన్ని పార్టీల నుంచి వ‌ల‌స‌లు ఖాయ‌మ‌న్న చ‌ర్చ సాగుతోంది. అయితే స‌రిగ్గా ఎన్నిక‌ల ముందు టీఆర్ఎస్ నాయ‌కుడు రాజ్య‌స‌భ స‌భ్యుడు డి.శ్రీ‌నివాస్ ఆక‌స్మికంగా ఆ పార్టీకి పెద్ద షాకిస్తూ కాంగ్రెస్‌లో చేరిపోతుండ‌డం స‌డెన్ ట్విస్ట్‌.

ప్ర‌స్తుతం ఢిల్లీ బయలుదేరి వెళుతున్న డీఎస్‌.. రేపు ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నార‌ని తెలుస్తోంది. డీఎస్ తో పాటు గాజ్వెల్ నాయ‌కులు నర్సారెడ్డి కాంగ్రెస్‌లోకి జంప్ అవుతున్నారు. టీడీపీ నేత ఆర్ కృష్ణయ్య , కరీంనగర్ టీఆరెస్ జెట్పీ చైర్మన్ తుల ఉమా సైతం కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. మొత్తానికి జంపింగ్ జ‌పాంగ్‌ల‌తో హోరెత్తిపోవ‌డం ఖాయ‌మైన‌ట్టే.