ఇదేం క‌న్య్పూజ‌న్ డీఎస్సూ

Sunday, October 28th, 2018, 10:41:06 AM IST

పార్టీ మార‌తాన‌ని చెప్ప‌డు కానీ మార‌డానికి మాత్రం సైలెంటుగా స‌ర్వం సిద్ధం చేసుకుంటాడు. టీఆర్ ఎస్‌లోనే వుంటానంటాడు కానీ టీఆర్ ఎస్ కు మాత్రం అందుబాటులో వుండ‌డు. పార్టీ మారే ఆలోచ‌న లేద‌ని, త‌ను పార్టీ మారుతున్న‌ట్టు ఎప్పుడైనా…ఎక్క‌డైనా..చెప్పానా? అంటూ రివ‌ర్స్ గేర్ ఏసేస్తుంటాడు ఇంకెవ‌రు మాజీ పీసీసి అధ్య‌క్షుడు, కాంగ్రెస్ మాజీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌స్తుత తెరాస ప్ర‌తినిధి డీ శ్రీ‌నివాస్‌. ధ‌ర్మ‌పురిలో రాజ‌కీయాన్ని ఓవైపు వేడెక్కిస్తూనే అబ్బ నేనేం చేయ‌లేదు…అంతా ఉత్తినే అంటూ కాక‌మ్మ‌క‌థ‌లు చెబుతూ మీడియాతో పాటు ప్ర‌ధాన రాజ‌కీయ పార్టీల‌ను, రాజ‌కీయ విశ్లేష‌కుల్ని సైతం క‌న్య్పూజ‌న్ కు గురిచేస్తున్నాడు.

కాంగ్రెస్ పార్టీలో పేరున్న నేత‌గా ఎదిగినా సీఎం ప‌దివి త‌న‌కు ద‌క్క‌ద‌ని తెలిసి ఇక ఇక్క‌డ వుంటే లాభం లేద‌ని తెరాస‌లోకి గ‌ప్ప‌గంతేశాడు. అదే ఆయ‌న పాలిట శాపంగా మారింది. త‌న‌ని అడ్డుపెట్టుకుని ధ‌ర్మ‌పురిలో ఆయ‌న పుత్ర‌ర‌త్నాలు చేయ‌ని దారుణాలు లేవు. దీంతో తెలంగాణ జేజ‌మ్మ క‌విత‌మ్మ క‌న్నెర్ర జేసింది. అక్క‌డి నుంచే డీఎస్ పార్టీ శ్రేణుల‌కు దూరంగా వుండాల్సి వ‌చ్చ‌దిం. ఇక తెరాస‌లో వుంటే లాభం లేద‌ని మంచి అద‌ను కోసం ఎదురుచూస్తున్న డీఎస్ ఈ ఎన్నిక‌ల‌ను అద‌నుగా చేసుకుని మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి చేర‌డానికి చ‌క‌చ‌క పావులు క‌ద‌ప‌డం మొద‌లుపెట్టాడు.

రాహుల్ గాంధీని క‌ల‌వ‌డానికి ఢిల్లీ వెళ్లిన డీఎస్ ఇదే అద‌నుగా అక్క‌డున్న ఏపీ సీఎం చంద్ర‌బాబును కూడా క‌లిసేసాడు. అయితే బాబును మ‌ర్యాద‌పూర్వ‌కంగానే క‌లిసాన‌ని, దీన్ని రాజ‌కీయం చేయెద్దంటూ మళ్లీ క‌న్య్పూజ‌న్ క్రియేట్ చేస‌తున్నాడు డీఎస్‌. అయితే తెరాస మాత్రం డీఎస్‌ను పార్టీ నుంచి గెంటేయ‌డానికి మంచి అద‌ను కోసం చూస్తోంది. డీఎస్ కు కావాల్పిందీ అదే. ఎప్పుడు తెరాస గెంటేస్తే అప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవాల‌ని ఇప్ప‌టికే పెద్ద స్కెచ్‌నే సిద్ధం చేసుకున్నడ‌ట డీఎస్‌. ఇంత‌కీ డీఎస్ పార్టీ మారేదెప్పుడ‌నేది తెలియాలంటే తెరాస గెంటేసే దాకా ఆగ‌క త‌ప్ప‌దు.

  •  
  •  
  •  
  •  

Comments