రెంటికీ చెడ్డ రేవడిలా తయారైన డిఎస్ !

Monday, October 29th, 2018, 09:37:43 AM IST

ఒకప్పటి కాంగ్రెస్, ప్రస్తుతం తెరాస రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ వ్యవహారం రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఉన్న పార్టీలో ప్రాధాన్యం దక్కకపోగా ఉన్నపళంగా వదిలేసి వచ్చిన పార్టీ నుండి ఆయనకు ఆదరణ కరువైంది. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడిన డిఎస్ కు కేసిఆర్ ఆరంభంలో మంచి ప్రాధాన్యమే ఇచ్చారు. ఏకంగా రాజ్యసభ ఎంపీ పదవిని కట్టబెట్టి అక్కున చేర్చుకున్నారు.

కానీ ఆ తర్వాతే వ్యవహారం చెడింది. నిజామాబాద్ జిల్లా నేతలు ఆయన పట్ల అసంతృప్తిగా ఉండటంతో డిఎస్ సైతం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. దీంతో ఆయన త్వరలోనే పార్టీని వీడతారని వార్తలొచ్చాయి. డిఎస్ కూడ అంర్గత పోరును తట్టుకోలేక బయటికి వెళ్లిపోవాలని డిసైడ్ చేసుకున్నారు. అందుకే ఢిల్లీ వెళ్లి మరీ రాహుల్ గాంధీని కలిశారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన పార్టీ మాత్రం మారలేదు.

దీని వెనుక ఆయన కాంగ్రెస్ పార్టీలో పెద్ద స్థానాన్ని ఆశించారని, కానీ రాహుల్ మాత్రం ఒకప్పుడు పార్టీని వీడిపోవడం, ప్రస్తుతం తెరాసలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం, అన్నిటినీ మించి ఆయనే వెతుక్కుంటూ రావడంతో పార్టీలో చేరితే చేరండి కానీ ఉన్నత స్థానాన్ని ఆశించవద్దని చెప్పడమే కారణమని అంటున్నారు. దీంతో డిఎస్ అయోమయంలో పడ్డారు. ఈ ఆశాభంగంతో తెరాసలో ఆయన మరింత వీక్ అయిపోయారు. ఇప్పటికే ఆయనకు ప్రాధాన్యత ఇవ్వని చాలా మంది గులాబీ నేతలు ఇకపై కనీసం పట్టించుకుంటారా అనే కూడ అనుమానమే.

  •  
  •  
  •  
  •  

Comments