ద‌ర్శ‌క‌ర‌త్నకు దాదాసాహెబ్ ఫాల్కే?

Friday, May 4th, 2018, 08:59:30 PM IST


ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాసరి నారాయ‌ణ‌రావు జయంతిని ద‌ర్శ‌కుల పండుగ‌గా ప‌రిశ్ర‌మ జ‌రుపుకుంది. ఈ సంద‌ర్భ ంగా శుక్రవారం సాయంత్రం ఫిలిం ఛాంబర్ ఆవ‌ర‌ణ‌లో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ దాస‌రి విగ్రహాన్ని ఆవిష్కరించారు. సూప‌ర్‌స్టార్ కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల‌, నంద‌మూరి బాల‌కృష్ణ‌, సి.క‌ళ్యాణ్‌, కోడి రామ‌కృష్ణ‌, డి.సురేష్‌బాబు, అల్లు అర‌వింద్‌, దాము, కె.ఎల్. నారాయ‌ణ‌, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ, వి.వి.వినాయ‌క్‌, ర‌మేష్ ప్ర‌సాద్, కొమ‌ర వెంక‌టేష్ త‌దిత‌రులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

న‌ట‌సింహా బాల‌కృష్ణ మాట్లాడుతూ-దాసరి పరిశ్రమ కష్టాలను తన ఇంట్లో కష్టాలుగా భావించి ప‌రిష్క‌రించేవారు. ఆయ‌న‌ 150వ సినిమాగా `పరమ వీర చక్ర` చేయడం నా అదృష్టం. ఏ విషయం అయినా.. కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం నాకు. ఆయ‌న శైలి అలాంటిది. దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా, నటుడిగా, కార్మికుడిగా ఆయనలో ఎన్నో కోణాలు దాస‌రిలో ఉన్నాయి“ అని అన్నారు. ద‌ర్శ‌క‌ర‌త్న‌కు దాదా సాహెబ్‌ ఫాల్కే, భారత రత్న అవార్డులు ఇవ్వాలని పార్లమెంట్‌లో పోరాడుతామని ఎంపీ మురళీ మోహన్ అన్నారు. భౌతికంగా ఆయన దూరమైనా.. సినిమాల‌తో ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం దాస‌రిని స్మ‌రించుకుంది. దాసరి జయంతి వేడుకలను నేడు ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో నిర్వహించనున్నారు.