పొలిటిక‌ల్ బ్లాస్టింగ్ న్యూస్‌.. జ‌న‌సేన‌లోకి ద‌గ్గుబాటి ఫ్యామిలీ..?

Sunday, October 14th, 2018, 11:09:48 AM IST

ఏపీలో సాత‌ర్వ‌త్రిక ఎన్నిక‌ల హ‌డావుడి మొద‌లైంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ఈ ఏడాది డిసెంబ‌ర్‌లో ఎన్నిక‌లు జ‌రుగ‌నుండ‌గా.. ఏపీలో వ‌చ్చే ఏడాది జ‌రుగ‌నున్నాయి. అయితే ఈ నేప‌ధ్యంలో ఇప్ప‌టి నుండే అధికార ప్ర‌తిప‌క్షాలు కొద‌మ‌సింహాల్లా పొట్లాడుకుంటున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెల‌వాల‌ని అధికార ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుంటున్నాయి.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో అనూహ్యంగా విజ‌యం సాధించి అధికారం చేప‌ట్టిన టీడీపీ.. 2019ఎన్నిక‌ల్లో కూడా అధికారం చేప‌ట్టాల‌ని భావిస్తుంది. మ‌రోవైపు ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ కూడా ఈసారి ఎలాగైన అధికారం చేజిక్కించుకోవాల‌ని నానా ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తోంది. ఈ నేప‌ధ్యంలోనే వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్రం చేస్తూ రాష్ట్రంలో జిల్లాల‌న్నీ చుట్టేస్తున్నారు. ఇక గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చిన జ‌న‌సేన‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలోకి దిగ‌నున్నామ‌ని ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు రాజకీయ వారసురాలిగా రంగ ప్రవేశం చేసిన దగ్గుబాటి పురందేశ్వరి, జ‌న‌సేన‌లో చేర‌నుంద‌నే వార్త‌లు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవ‌తున్నాయి. గ‌త ఏడాదిగా పురంధేశ్వ‌రి కుటుంబం వైసీపీలో చేర‌నున్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపించాయి. అయితే ఆ వార్త‌ల‌న్నీ అవాస్త‌వం అని తేలింది. అయితే తాజాగా మాత్రం పురంధేశ్వ‌రి కుటుంబం జ‌న‌సేన‌లో చేర‌నున్నార‌నే వార్త సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌ ర‌చ్చ చేస్తుంది.

అయితే పురంధేశ్వ‌రి త‌న‌కు ఖ‌చ్ఛిత‌మై హామీలు కావాల‌ని.. త‌న కుమారుడ హితేష్ చెంచురాంకి ప‌ర్చూరు నుండి అసెంబ్లీ టిక్కెట్, త‌న భర్త అయిన ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకి ఒంగోలు ఎంపీ టిక్కెట్టు ఇవ్వాల‌ని, ఇక త‌న‌కు మాత్రం విజ‌య‌వాడ నుండి ఎంపీ టిక్కెట్టు ఇస్తే జ‌న‌సేన‌లో చేర‌తామ‌ని చెప్పిన‌ట్టు స‌మాచారం. ఈ ప్ర‌తిపాద‌న‌కి జ‌న‌సేన అధినేత కూడా సుముఖంగానే ఉన్నార‌ని జ‌న‌సేన వ‌ర్గీయుల నుండి ఒక టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీలో చేర‌నున్నార‌ని ఊరిస్తూ వ‌స్తున్న ద‌గ్గుబాటి కుటుంబం జ‌న‌సేన‌లోకి చేరితే.. వైసీపీకి పెద్ద‌గా పోయేదేమీ లేద‌ని లైట్ తీసుకున్నా.. అధికారం టీడీపీకీ మాత్రం ఈ వార్త మింగుడు ప‌డ‌ని విష‌య‌మ‌ని.. దీంతో ఈ మ్యాట‌ర్ టీడీపీ పెద్ద షాకే అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.