తెరాస‌పై దానం వ్యాఖ్య‌ల వెన‌క‌..!

Friday, November 9th, 2018, 06:28:35 PM IST

కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని నెల‌ల క్రితం దానం నాగేంద‌ర్ తెరాస గూటికి చేరిన విష‌యం తెలిసిందే. ఖైర‌తాబాద్ నుంచి టికెట్ ఆశిస్తున్న ఆయ‌న‌కు తెరాస మొండిచేయి చూపించే అవ‌కాశం వుందని రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో దానం నాగేంద‌ర్ తెరాస‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఖైర‌తాబాద్ అసెంబ్లీ టికెట్ విష‌యంలో రెండు రోజుల్లో స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని తెలిపిన దానం ఆ స్థానం నుంచి ఎవ‌రికి టికెట్ ఇచ్చినా నా మ‌ద్ద‌తు త‌ప్ప‌కుండా వుంటుంద‌ని తేల్చి చెప్ప‌డం కాంగ్రెస్ వ‌ర్గాల్ని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

కాంగ్రెస్ టికెట్ నిరాక‌రించిన వేళ ఒంటికాలిపై లేచి టీడీపీని ఆశ్ర‌యించిన దానం ఆ త‌రువాత మ‌ళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన విష‌యం తెలిసిందే. అయితే త‌న పంథాకు భిన్నంగా దానం నాగేంద‌ర్ వ్య‌వ‌హ‌రిస్తూ తెరాస‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌డం కాంగ్రెస్ వ‌ర్గాలు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ట‌. కూట‌మితో క‌లిసి బీసీ నాయ‌కుల‌కు కాంగ్రెస్ అన్యాయం చేస్తోంద‌ని, సీనియ‌ర్ అని కూడా చూడ‌కుండా పొన్నాల ల‌క్ష్మ‌య్య‌కు జ‌న‌గామ టికెట్ ఇవ్వ‌కుండా అవ‌మాన ప‌రిచార‌ని మండిప‌డ్డారు. ఈ రోజు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో క‌లిసి ఖైత‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో దానం ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ప‌థ‌కాలే తెరాస‌ను మ‌ళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయ‌ని ఈ సంద‌ర్భంగా దానం ధీమాను వ్య‌క్తం చేశారు. ఇటీవ‌ల ఇండియాటుడే నిర్వ‌హించిన స‌ర్వే ఇదే చెబుతోంద‌ని, రాష్ట్రంలో 75 శాతం ప్ర‌జ‌లు మ‌ళ్లీ కేసీఆర్‌నే సీఎంగా కోరుకుంటున్నార‌ని, ఇక ఏ శ‌క్తీ తెరాస‌ను అడ్డుకోలేద‌ని ఆనందాన్ని వెల్లిబుచ్చారు.

  •  
  •  
  •  
  •  

Comments