మాజీ కాంగ్రెస్ నేతకు కేసీఆర్ బంపర్ ఆఫర్!

Monday, September 10th, 2018, 08:07:41 PM IST

కాంగ్రెస్ మాజీ మంత్రి దానం నాగేందర్ ఇటీవల పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే టీఆరెస్ నుంచి ఎమ్మెల్యే టికెట్ దక్కనుందా అనే విషయంలో ఎన్ని అనుమానాలకు తావిస్తుండగా ఫైనల్ గా ఆయనకు ఊరట లభించినట్లు సమాచారం. మొత్తానికి లైన్ క్లియర్ అయిందనే అంటున్నారు టీఆరెస్ వర్గాలు.

హైదరాబాద్ గోషామహల్ సీటును దానంకు కేసీఆర్ కేటాయించినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఆ నియోజకవర్గం ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రాజాసింగ్ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే పరిసర ప్రాంతాల్లో కాస్త పట్టున్న దానంను అభ్యర్థిగా ఉంచడం కరెక్ట్ అని కేసీఆర్ అధిష్ఠానం డిసైడ్ అయినట్లు సమాచారం. ఇక గత ఎన్నికల్లో గోషామహల్ నుంచి టీఆరెస్ తరపున పోటీ చేసిన ప్రేమ్ కుమార్ పెద్దగా పోటీని ఇవ్వలేకపోయారు. మరి ఇప్పుడు దానం ఏ స్థాయిలో పోటీని ఇస్తారో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments