నాతో సెల్ఫీ దిగే రేంజ్ కాదు నీది..

Saturday, September 24th, 2016, 07:11:02 PM IST

selfi
తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ యువకుడి పై పట్టరాని కోపంతో దాడి చేసింది.నాతోనే సెల్ఫీ దిగుతావా అన్నట్లుగా ప్రవర్తించింది. ఇంతకీ ఎవరబ్బా ఆ సెలెబ్రిటీ అనుకుంటున్నారా ? సెలెబ్రిటీ కాదు.. కనీసం మనిషి కూడా కాదు. అది ఓ కొండ చిలువ.

రాజస్తాన్ మౌంట్ అబూ జిల్లా సిరోహి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొండ చిలువ సంచరించడం అక్కడి ఆసుపత్రి సిబ్బందికి కనిపించింది.ఆసుపత్రి సిబ్బంది వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.అక్కడికి చేరుకున్న అటవీశాఖ వారు కొండా చిలువని జాగ్రత్తగా పట్టుకుని తీసుకువెళుతుండగా.. ఓ యువకుడు అత్యుత్సాహంతో కొండచిలువతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు.ఆ కొండ చిలువకు సెల్ఫీ లంటే ఇష్టం లేదో లేక తనతో సెల్ఫీ దిగే రేంజ్ అతనిది కాదనుకుందో కానీ అతడిపై ఒక్కసారిగా దాడి చేసింది.అదృష్టం బావుంది అతడికి ఏమికాలేదు.

కొండ చిలువ కోపాన్ని మీరూ వీడియో లో చుడండి..