2019 బిగ్ ఫైట్.. వైసీపీకి డేంజర్ సిగ్నల్.. జ‌గ‌న్ గుర్తించేనా..?

Tuesday, November 6th, 2018, 05:45:35 PM IST

ఏపీలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారంలోకి రావాల‌న్న వైసీపీ త‌న‌దైన ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు సాగుతుంది. అయితే ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చిన జ‌న‌సేన‌తో వైసీపీకి డేంజ‌రే అని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎందుకంటే జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ప్ర‌జ‌ల్లోకి దూసుకుపోతున్నారు. అయితే ప్ర‌తిప‌క్ష నేత అయిన జ‌గ‌న్.. అధికార ప‌క్షం చేసే త‌ప్పుల‌ను నిల‌దీయ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నే చెప్పాలి.

దీంతో ఈవిష‌యాన్ని క్యాచ్ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌గ‌న్ పై బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తాజాగా తూర్పుగోదావ‌రి జిల్లాలోని పెద్ద‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో టీడీపీ నేత‌లు య‌ధేచ్ఛ‌గా అక్ర‌మ మైనింగ్ చేస్తుంటే.. జ‌గ‌న్ ప్ర‌శ్నించ‌కుండా, త‌న‌కేమి ప‌ట్ట‌న‌ట్టు పాద‌యాత్ర అంటూ రోడ్ల మీద తిరుగుతున్నాడ‌ని.. దీంతో జ‌గ‌న్‌కు కూడా అందులో భాగం ఉందా అని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు. ఈ పాయింట్ ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.

చంద్ర‌బాబును న‌మ్మి ప‌ట్టం క‌ట్టిన టీడీపీ చేస్తున్న అరాచ‌క పాల‌నకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌జలు త‌మ‌దైన శిక్ష వేస్తారు.. మ‌రి జ‌గ‌న్‌కు కీల‌క‌మైన బాధ్య‌త‌లు అప్ప‌గిస్తే ఆయ‌న మాత్రం త‌న సొంత ప్ర‌యోజ‌నాల‌కే ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్నాడ‌ని.. ఒక ప్ర‌తిప‌క్ష‌నేత‌గా జ‌గ‌న్ ఫెయిల్ అయ్యాడ‌ని భావిస్తే..జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి అప్పుడు జ‌న‌సేన లైమ్‌లైట్‌లోకి వ‌చ్చి వైసీపీ కొంప కొల్లేరు అవుతుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు. నిజ‌మే క‌దా ప్ర‌స్తుతం ప‌వ‌న్ వ్యాఖ్య‌లు చూస్తుంటే.. ఏపీలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయని.. 2019లో వైసీపీ,టీడీపీలు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌వ‌ని.. జ‌న‌సేనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌నుంద‌ని నేనే ముఖ్య‌మంత్రిని అంటూ ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు వైసీపీ శ్రేణులు గ‌మ‌నించారో లేదో.. వైసీపీకి డేంజ‌ర్ బెల్ మోగింద‌ని.. జాగ్ర‌త్త‌ప‌డ‌క‌పోతే 2014 రిజ‌ల్టే రిపీట్ అవుతుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments