సంచలనం సృష్టించిన దాసరి వ్యాఖ్యలు

Wednesday, October 22nd, 2014, 08:01:21 PM IST

dasari
దర్శక రత్న దాసరి నారాయణ రావు ‘లక్ష్మీ మా ఇంటికి రావే’ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రకంపనాలను సృష్టించాయి. ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో రౌడీయిజం నడుస్తున్నదని… పెద్ద సినిమాల కోసం చిన్న సినిమాలను బలిచేస్తున్నారని..తమ కాలంలో ఇటువంటి విపరీత పోకడలు చూడలేదని దాసరి నారాయణ రావు అన్నారు. చిన్న సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి దియోటర్స్ కావాలంటే.. ముందు సినిమా రెడి చేసుకో.. తరువాత గ్యాప్ వస్తే.. విడుదల చేసుకోవచ్చు అంటున్నారని.. దాసరి మండిపడ్డారు. చిన్న సినిమాలు పెద్ద సినిమాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి మనుగడ సాగించాల్సిన పరిస్థితులు వస్తాయని తాను కలలో కూడా ఊహించలేదన్నారు. పరోక్షంగా లౌక్యం సినిమా గురించే ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తున్నది. లౌక్యం సినిమా బాగా ఆడుతున్నప్పటికీ ఒక పెద్ద సినిమా కోసం ఆ సినిమాను పక్కన పెట్టారని.. దానిపై దాసరి పైవిధంగా వ్యాఖ్యలు చేసుంటారని ఫిల్మ్ నగర్ లో టాక్ వినిపిస్తున్నది.