తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రి పాలైన దాసరి..!

Tuesday, January 31st, 2017, 11:13:31 AM IST

dasari-naranarao
మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆరోగ్య సమస్యలతో భాదపడుతూ ఆయన మూడు రోజులుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. గతకొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల సమస్యలతో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు .ఆయనకు మెరుగైన చికిత్సని అందించడం కోసం వైద్యులు ఐసీయూకి తరలించినట్లు తెలుస్తోంది.

ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధింత సమస్యలతో భాదపడుతున్న ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు కిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం దాసరి ఆరోగ్యం నిలకడ గా ఉన్నట్లు సమాచారం అందుతోంది. గత కొంత కాలంగా దాసరి అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా యాక్టివ్ గా లేరు.