పెళ్లి పీటలెక్కేసిన ఐపీఎల్ డాషింగ్ బ్యాట్సమెన్..!

Sunday, December 23rd, 2018, 04:58:59 PM IST

భారతదేశంలో ఐపీఎల్ మ్యాచులంటే క్రికెట్ అభిమానులకు ఎంత ఇష్టమో అందరికి తెలుసు.ఆ మ్యాచులు కూడా నిర్ణీత ఓవర్లలో ఆటగాళ్లు ప్రదర్శించే వీరోచిత పోరాటమే దీనికి నిదర్శనం అని చెప్పాలి.ప్రత్యర్థి టీం ఎలాంటిది అయినా సరే వారిని చీల్చి చెండాడే బ్యాట్సమెన్లు ప్రతీ ఐపీఎల్ టీం లో ఉంటారు.ఇప్పుడు అలాంటి విద్వాంసకర బ్యాట్సమెన్ పెళ్లి పీటలెక్కారు.అతనే సంజు సామ్సన్ ఇతగాడు గత ఏడాది ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు తరపున ఎలాంటి ప్రదర్శన చూపారో అందరికి తెలుసు.క్రీజ్ లో ఉన్నంతసేపు ఫోరులు,సిక్సర్లతో మోత మోగించేసావాడు.కేరళకి చెందిన ఈ యువ ఆటగాడు తన చిన్న నాటి స్నేహితురాలు అయినటువంటి చారులతను ఈ మధ్యనే ప్రేమించి వివాహం చేసుకున్నారు.ఇతనికి 2017 లో జరిగిన ఐపీఎల్ లో 1000 పరుగులు పూర్తి చేసిన అత్యంత పిన్న వయస్కునిగా ఓ అరుదైన రికార్డు కూడా ఉంది.