2019 వరల్డ్ కప్ తర్వాతే రిటైర్మెంట్ అంటున్న డాషింగ్ బౌలర్!

Friday, July 27th, 2018, 09:00:05 AM IST

దక్షిణాఫ్రికా స్పీడ్ గన్ గా పేరుగాంచిన డాషింగ్ బౌలర్ డేల్ స్టెయిన్, రాబోయే వరల్డ్ కప్ తరువాత పరిమిత ఓవర్ల క్రికెట్ కు తాను రిటైర్మెంట్ ప్రకటించనున్నట్లు తెలిపాడు. ఇప్పటికే గాయాలనుండి కోలుకున్న అతడు ఇటీవల శ్రీలంక తో జరిగిన రెండు టెస్ట్ ల మ్యాచ్ లలో మొదటి టెస్ట్ లో 3 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం తన ఫామ్ పర్వాలేదనిపించినా, ఫిట్ నెస్ పరంగా మాత్రం తాను బాగున్నట్లు పేర్కొన్నాడు. క్రికెట్ ఆటలో ఏ మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించిన గాయాలపాలవడం ఖాయమని, అయితే తిరిగి గాయం నుండి కోలుకుని ఫిట్ నెస్ సాధించడమే అన్నిటికంటే కష్టమని చెపుతున్నాడు. తమ దక్షిణాఫ్రిక టీమ్ బాటింగ్ లైన్ అప్ ఓక సారి పరిశీలిస్తే టాప్ ఆర్డర్ లో గల వారు దాదాపుగా అందరూ 1000 మ్యాచ్ ల వరకు ఆడారని అదే లోయర్ ఆర్డర్ వారిని పరిశీలిస్తే అందులో ఎవరు కూడా 150 మ్యాచ్ లకు మించి ఆడలేదని అన్నారు.

అయితే ఆటగాళ్లు తమని తాము నిరూపించుకోవడం ప్రతిసారి కుదరదని , ఒకవేళ ఈ సారి కనుక తమ టీమ్ మానేజిమెంట్ అనుభవానికి ప్రాధాన్యత ఇస్తే తనకు తప్పకండా వరల్డ్ కప్ స్క్వాడ్ లో చోటు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసాడు. ఇకపోతే ఆ పై వరల్డ్ కప్ సమయంకల్లా తనకు 40 ఏళ్ళు నిండుతాయని, అప్పటివరకు తాను క్రికెట్ లో ఉండనని, అందుకే ఈ వరల్డ్ కప్ అనంతరం రిటైర్మెంట్ కు నిర్ణయించినట్లు చెప్పుకొచ్చాడు. ఒకవేళ దేవుని దయవల్ల టీంలో తాను ఉంటే మాత్రం తన శ్రయశక్తులా పోరాడి దేశానికి సేవలందిస్తానని ఈ డాషింగ్ బౌలర్ చెపుతున్నాడు. చూడాలి మరి ఈ బౌలర్ ఆశలు ఏ మాత్రం నెరవేరుతాయో…..

  •  
  •  
  •  
  •  

Comments