బ్రేకింగ్ న్యూస్ : కూతురి ప్రేమవివాహం…. ఇంటికిపిలిచిన తండ్రి ఏమి చేసాడంటే?

Tuesday, April 3rd, 2018, 04:18:05 PM IST

ప్రస్తుత సమాజంలో మానవుడి మేధో శక్తి ఎన్ని అద్భుతాలు సృష్టిస్తున్నప్పటికీ, మనిషిలోని మూర్ఖత్వం, పైశాచికత్వం మాత్రం పోవడంలేదు. కన్నకూతురు ప్రేమించిన యువకుడిని పెళ్లిచేసుకుందని సహించలేక ఆ యువకుడిని అతి కిరాతకంగా హతమార్చాడో కసాయి తండ్రి. వివరాల్లోకి వెళితే, ఈ ఘటన అనంతపురం జిల్లా నల్లమాడ మండలం బడవాండ్లపల్లిలో చోటు చేసుకుంది. బడవాండ్లపల్లికి చెందిన భార్గవి అదే గ్రామానికి చెందిన ధనుంజయని ప్రేమించింది. అయితే వారిపెల్లికి భార్గవి తల్లితండ్రులు ఒప్పుకోకపోవడంతో, ఏడు నెలల క్రితం గ్రామం నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకుంది.

కొన్నాళ్ళకు వారి ఆచూకీ తెలుసుకున్న భార్గవి తల్లి కాటమ్మ, జరిగిందేదో జరిగిపోయింది, ఇక మిమ్మల్ని ఏమీ అనము, ఇంటికి రండి అంటూ ఇటీవల కూతురు, అల్లుడిని ఆహ్వానించింది. దీంతో భార్గవి, ధనుంజయ పదిరోజుల క్రితం గ్రామానికి వచ్చారు. అయితే అత్తంటికి వచ్చిన ధనుంజయకు భార్గవి తండ్రి గిరిబాబు ప్రవర్తన మీద ఎందుకో అనుమానం కలిగింది. దీంతో భయపడ్డ అతడు, కదిరి మండలం కాళసముద్రంలోని తన అక్క ఇంటికి వెళ్ళాడు. అయితే భార్గవి ధనుంజయకు ధైర్యం చెప్పి తమ తల్లిదండ్రులు ఏమీ అనరని ఇంటికి రమ్మని నచ్చజెప్పడంతో, ధనుంజయ రెండ్రోజుల క్రితం మళ్లీ అత్తవారింటికి వెళ్లాడు. కాగా, కూతురి ప్రేమపెళ్లి మొదటినుండి ఏమాత్రం ఇష్టం లేని భార్గవి తండ్రి, ధనుంజయపై కోపంతో రగిలిపోయాడు.

ఈ క్రమంలో సోమవారం రాత్రి ధనుంజయతో వాగ్వివాదానికి దిగి, చివరికి అతని గొంతులో ఈటెతో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఆ గొడవలో అడ్డుకున్న భార్గవి కూడా స్వల్పంగా గాయపడింది. అనంతరం గిరిబాబు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న గిరిబాబు కోసం గాలిస్తున్నారు. కాగా, నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని ధనుంజయ కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు….

  •  
  •  
  •  
  •  

Comments