తల్లికి పెళ్లి చేసిన కూతురు.. సోషల్ మీడియాలో విమర్శలు!

Saturday, January 13th, 2018, 01:40:28 PM IST

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త చాలా హాట్ టాపిక్ గా మారింది. కన్నతల్లికి పెళ్లి చేసిన ఒక యువతిపై ప్రశంసలు ఏ రేంజ్ లో అందుతున్నాయో తెలియదు గాని విమర్శలు మాత్రం బాగానే అందుతున్నాయి. అసలు మ్యాటర్ లోకి వెళితే.. రాజస్థాన్ కు చెందిన ఒక మహిళకు కొన్నేళ్ల క్రితం భర్త చనిపోయాడు. అయితే ఇటీవల ఆమె కుమార్తె తల్లి ఒంటరితనాన్ని చూసి తెట్టుకోలేక ఒక వ్యక్తిని చూసి పెళ్లి చేసింది. అన్ని ఏర్పాట్లను దగ్గరుండి తానే చూసుకొని చాలా వైభవంగా పెళ్లి చేయడం మీడియాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

అయితే మొదట ప్రశంసలు అందాయి కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా వస్తోన్న ఆరోపణలు మాత్రం వైరల్ అవుతున్నాయి. భర్త చనిపోతే అతన్ని అంత ఈజీగా తల్లి మరచిపోయిందా? అలాగే కూతురు కూడా తండ్రిని మరచిందా? అంటూ.. తల్లిని చూసుకోవడానికి కూడా తీరిక కుదరడం లేదా అని కామెంట్స్ చేస్తున్నారు. తల్లిని చూసుకోలేకే ఆ విధంగా వేరే అతని చేతిలో పెట్టిందని మరికొంత మంది విమర్శలు చేయడం వివాదాలకు దారి తీస్తోంది. అయితే ఈ విమర్శలకు కూడా మరికొంత మంది కౌంటర్లువేసే ప్రయత్నం చేస్తున్నారు.