వార్నర్ కూడా అవుట్.. ఐపీఎల్ లో లేనట్టే?

Wednesday, March 28th, 2018, 02:34:50 PM IST

కొన్ని రోజుల క్రితం జరిగిన సౌత్ ఆఫ్రికా – ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ లో స్మిత్‌ అండ్ వార్నర్‌ – బెన్‌క్రాఫ్ట్ బాల్‌ టాంపరింగ్‌ కు పాల్పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే రోజు రోజుకి ఆ వివాదం భారత్ లో సంచలనం రేపుతోంది. క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకునే నిర్ణయం వెనుక ఇప్పుడు వారి భవిష్యత్తు ఆధారపడి ఉంది. దాదాపు ఏడాది వరకు నిషేధం విధించవచ్చని తెలుస్తోంది. ఇక వచ్చే నెల స్టార్ట్ కాబోయే ఐపీఎల్ 11 లో కూడా వార్నర్ – స్మిత్ కనిపించేలా లేరని టాక్ వస్తోంది. ఇప్పటికే రాజాస్థాన్ కెప్టెన్ హోదా నుంచి స్మిత్ వైదొలిగాడు. అజింక్య రహానే కెప్టెన్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఇక డేవిడ్ వార్నర్ కూడా సన్ రైజర్స్ జట్టు కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు క్లారిటీ ఇచ్చేశాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీఈవో కె.షణ్ముగం సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. శిఖర్ ధావన్ ని కెప్టెన్ గా నియమించాలని జట్టు యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం.