స్టార్ క్రికెటర్ భార్యకు దుమ్ము దులిపేసింది..!

Wednesday, November 1st, 2017, 12:18:08 AM IST

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య యాషెస్ సిరీస్ ఎంత ప్రతిష్టాత్మకంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇరు జట్ల ఆటగాళ్లు తమ సర్వ శక్తులని ఒడ్డి విజయానికి కృషి చేస్తారు. త్వరలో యాషెస్ సిరీస్ జరగనున్న నేపథ్యంలో అప్పుడే ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాటల యుద్ధం మొదలెట్టేశారు. ఆసీస్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ఈ సిరీస్ ని యుద్ధంతో పోల్చాడు. అంతే కాదు అతడి భార్య కాండిల్ ఇంకో అడుగు ముందుకేసి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్ట్రోక్స్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయింది.

ఆమె మాట్లాడుతూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు అత్యుత్తమ జట్టుతో తలపడాలని కోరుకుంటారు. అందుకే బెన్ స్టోక్స్ ఆడితే బావుంటుందని అంతా భావిస్తున్నారు. అతడు ఆడతాడో లేదో నాకు తెలియదు. కానీ ఇటీవల అతడి ప్రవర్తన మాత్రం సరిగా లేదు. అతడి వీడియో ఫుటేజ్ చూస్తే అసహ్యం కలుగుతోంది అంటూ వ్యాఖ్యానించింది. ఇటీవల బెన్ స్టోక్స్ ఓ బార్ వద్ద గొడవ పడ్డ వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments