సీబీఐ కి చిక్కిన దావూద్ అనుచరుడు

Thursday, March 8th, 2018, 10:31:37 AM IST

కొన్నేళ్లుగా భారతావనిని గడగడలాడిస్తున్న గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం కథ క్లైమాక్స్ కి వచ్చింది. అనుచరుడు ఫారూక్ తక్లాను ఇవాళ ముంబైలోని టాడా కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నారు. అతన్ని దుబాయ్ నుంచి ముంబైకి తీసుకువచ్చారు. 1993లో ముంబైలో జరిగిన పేలుళ్ల కేసులో ఇతను కూడా నిందితుడు. పేలుళ్ల ఘటన తర్వాత ఫారూక్ భారత్ విడిచి వెళ్లాడు. ఆ కేసులో సీబీఐ అతన్ని ప్రశ్నిస్తోంది. 1995లో ఫారూక్‌పై రెడ్‌కార్నర్ నోటీసును జారీ చేశారు. కుట్ర, హత్య, హత్యాయత్నం, ప్రమాదకర ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఫారూక్ నిందితుడు. ఇంటర్‌పోల్‌లో ఇతనిపై అనేక కేసులు ఉన్నాయి. ఫారూక్‌ను తీసుకురావడంలో ఒకరకంగా భారత్ దౌత్యపరమైన విజయాన్ని సాధించింది అని చెప్పవచ్చు. ఫారూక్‌ను పట్టుకువచ్చేందుకు సీబీఐ.. యూఏఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఒప్పించింది. ముంబై పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్న మరో 27 మంది ఇంకా పరారీలోనే ఉన్నారు. మాఫియా డాన్ ఇబ్రహీం కస్కర్, టైగన్ మెమన్‌లు.. సీబీఐకి చిక్కకుండా తప్పించుకు పారిపోతున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో, టాడా కోర్టు ఇద్దరికి మరణశిక్షను విధించింది. అబూ సలేంతో పాటు మరో ఇద్దరికి కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పట్టుబడ్డ ఫారూక్ కి ఎలాంటి శిక్ష వేస్తుందో ఏమని విచారణ చేస్తుందో కోర్టు చూడాలి.