ఏపీలో ‘సప్తగిరి’ చానెల్ ప్రారంభం

Saturday, September 27th, 2014, 11:45:29 AM IST


రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయవాడ దూరదర్శన్ సప్తగిరి చానెల్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా దూరదర్శన్ అధికారులు చంద్రబాబుకు, వెంకయ్యకు జ్ఞ్యాపికలను అందజేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మంత్రులు పల్లె రఘునాధ రెడ్డి, దేవినేని ఉమా మహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖా మంత్రి పల్లె రఘునాధ రెడ్డి విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను నవరాత్రుల సందర్భంగా దర్శించుకుని అనంతరం విలేకరులతో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు పూర్వ వైభవం రావాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు. అలాగే వచ్చే ఏడాది నుండి దసరా పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నదని పల్లె రఘునాధ్ రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా బెజవాడ దుర్గమ్మను దర్శించుకోనున్నారు.