వీడియో : వాటే క్యాచ్.. మైండ్ బ్లోయింగ్!

Monday, April 2nd, 2018, 03:53:01 PM IST

క్రికెట్ లో అద్భుతాలు జరగడం చాలా అరుదు. ముఖ్యంగా అద్భుతమైన క్యాచ్ లను వీక్షించే అవకాశం ప్రతి సారి రాదు. కేవలం అప్పుడప్పుడు మాత్రమే ఆటగాళ్లు గ్రౌండ్ లో ఆటలో భాగంగా విన్యాసాలను చూపిస్తూ మతిపోగొడుతుంటారు. రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా ఆటగాడు క్యాచ్ ను పట్టిన తీరును చుస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే. బంతి గాల్లో ఉండగానే అప్రమత్తమై అతను దూకి పట్టుకున్న విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా – ఆస్ట్రేలియా ల మధ్య నాలుగవ టెస్ట్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 488 పరుగులు చేయగా అనంతరం ఆసీస్‌ తడబడుతూ 221 పరుగులు చేసింది. కెప్టెన్ టిమ్ ఫైన్‌ ఒంటరిపోరాటం బాగానే చేశాడు. అయితే అతను మంచి ఫామ్ లో ఉండగా రబాడ బౌలింగ్ లో ఎల్గార్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అసలైతే ఆ బంతి ఫోర్ వెళుతుందని అంతా అనుకున్నారు. ఎల్గార్ కి క్యాచ్ దొరకడం అసాధ్యమని అనుకుంటున్న సమయంలో అతను ఎగిరి అందుకున్నాడు. దీంతో ఒక్కసారిగా అందరు ఆశ్చర్యపోయి చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. ప్రస్తుతం ఎల్గార్ క్యాచ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి మరి.