పెళ్లికేలితే మృత్యువు ఎదురైంది… 25 మంది మృతి…

Tuesday, March 6th, 2018, 11:58:11 AM IST

ఎంకి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టుగా పెళ్లి బృందంతో వెళ్తున్న ఓ ట్రక్కు వంతెనపైనుండి వెళ్తుండగా అదుపుతప్పి కిందికి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదం గుజరాత్‌లో భావ్‌నగర్‌ సమీపంలో రంగేలా వంతెనపై జరిగినట్టు ఘటనా స్థలి పోలిసుల సమాచారం. ఈ ప్రమాదంలో 25మందికి పైగా అక్కడికక్కడే మృతిచెందగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలతో ఆ ప్రాంతమంతా భీతావాహంగా మారింది. ట్రక్కులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందగా, క్షతగాత్రులకు సంఘటనా స్థలంలో ఉన్న అంబులెన్సుల్లోనే చికిత్స నిర్వహిస్తున్నారు. ట్రక్కు బోల్తా పడటంతో మృతదేహాలు అక్కడక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. మరికొన్ని మృతదేహాలు నాలాలో పడిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది కలుగుతున్నట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నాలాలో ఇరుక్కుపోయిన మృత దేహాలను అతికష్టంగా బయటికి తీస్తున్నట్టు సమాచారం అందగా, మృత దేహాలన్నింటినీ దగ్గరలోని భావానగర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు.