అమ్మ మేనకోడలు రంగంలోకి దిగబోతోందా..?

Wednesday, February 8th, 2017, 09:47:59 AM IST


తమిళ రాజకీయాలవైపు దేశమంతా ప్రస్తుతం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.పన్నీర్ సెల్వం, శశికళ మధ్య వార్ షురూ అవడంతో అటు ప్రతిపక్షమైన డీఎంకే కి, కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి కలసి వచ్చే అంశం అని విశ్లేషకులు అంటున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం శశికళ వైపు ఉన్నా క్రమంగా ఆమె పై వ్యతిరేకత పెరుగుతోంది.ఆమె వ్యతిరేక వర్గానికి ఇది మంచి అవకాశంగా మారింది. జయమేనకోడలు దీపా జయకుమార్ ఇప్పటికే శశికళ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లోకూడా శశికళ కు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది. అన్నా డీఎంకే లోని శశికళ వ్యతిరేక వర్గం ఇప్పటికే దీపతో రాజకీయపరమైన చర్చలు జరుపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు పన్నీర్ కూడా శశికళపై ఎదురు తిరగడంతో దీపకు కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. తానే జయకు సరైన వారసురాలిగా దీప ఇప్పటికే ప్రకటించుకుంది.

అన్నా డీఎంకే పార్టీ మూడు ముక్కలుగా చీలుతుందా లేక పన్నీర్, దీప జయకుమార్ లు కలసి కొత్త పార్టీని స్థాపిస్తారా అనేప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.దీపకు అన్నా డీఎంకే పార్టీలో కొందరి ఎమ్మెల్యే ల మద్దత్తు ఉందని, వారు పన్నీర్ వర్గం ఏకమైతే శశికళను చిక్కులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీపప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావలసిన సమయం ఆసన్నమైందని శశికళ వ్యతిరేక వర్గం భావిస్తున్నారట. దీనికోసం సత్వరమే ఆమె రాజకీయాల్లో అనుడుపెట్టేలా ఒత్తిడి చేయాలని వారు భావిస్తున్నారు.