షాక్.. అర్హత కోల్పోయిన అమ్మ మేనకోడలు..!

Tuesday, December 5th, 2017, 04:02:36 PM IST

ఆర్కే నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో తమిళ రాజకీయాలు మరో మారు హీట్ ఎక్కాయి. జయలలిత మరణం తరువాత పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు, ఆర్కే నగర్ ఉపఎన్నికలు సడెన్ గా హీరో విశాల్ ఎంట్రీ ఇలాంటి అనూహ్య ఘటనలతో తమిళ రాజకీయం వేడెక్కింది. కాగా జయ రాజకీయ వారసురాలిగా ఎదగాలని ప్రయత్నాలు చేసిన ఆమె మేనకోడలు దీప జయకుమార్ కు ఊహించని షాక్ తగిలింది. ఆర్కే నగర్ లో పోటీ చేసేందుకు ఆమె సమర్పించిన నామినేషన్ పత్రాలని ఎన్నికల సంఘం రిజెక్ట్ చేయడం సంచలనంగా మారింది.

దీప సమర్పించిన పత్రాల్లో వివరాలు సరిగా లేవనే కారణంతో ఎన్నికల అధికారులు నామినేషన్ ని తిరస్కరించారు. తదుపరి దీప ఎం చేస్తుందనేది ఆసక్తిగా మారింది. ఆర్కే నగర్ నుంచి పోటీ చేయడానికి దీప మొదటి నుంచి ఆసక్తి చూపించారు. కానీ చివరకు ఆమెకు నిరాశే మిగిలింది.

  •  
  •  
  •  
  •  

Comments