దీటుగా స్పందించిన దీపికా పదుకొనె

Monday, September 15th, 2014, 02:45:53 PM IST


తను ధరించిన వస్త్రదారణపై వస్తున్న విమర్శలను ఫైండింగ్ ఫ్యానీ హీరోయిన్ దీపికా పదుకొనె తిప్పికొట్టారు.తానొక మహిళనని, తనకు మహిళల సహజ సౌదర్యం ఉన్నదని.. తను ఎటువంటి వష్ట్రదారణ ధరిస్తే.. మీకేందుకని ఆమె మండిపడ్డారు. స్త్రీలను గౌరవించడం నేర్చుకోవాలని.. వారిని గౌరవించడం చాతగానపుడు వారిగురించి మాట్లాడటం మంచిదికాదని అన్నారు.

ఓ ప్రముఖ దినపత్రికలో దీపికా పదుకొనె వస్త్రధారణపై విమర్శలు చేయడంతో ఆమె పై విధంగా స్పందించారు. ట్విట్టర్ లో దీపికా స్పందనకు దేశవ్యాప్తంగా ప్రముఖుల దగ్గరినుంచి సామాన్యుడి వరకు సంఘీభావం తెలుపుతున్నారు.