యూ ట్యూబ్ కు జరిమానా విధించిన ఢిల్లీ కోర్టు!

Wednesday, July 11th, 2018, 11:04:17 AM IST

యూ ట్యూబ్ ప్రపంచంలో ప్రస్తుతం ఎన్నో రకాల వీడియోలు ఉన్నాయి. రోజు కొన్ని లక్షల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. అలాగే కొన్ని కోట్ల వీడియోలను కూడా డిలీట్ చేస్తుంటారు. ఇటీవల కాలంలో ఆ సంఖ్య ఇంకా ఎక్కువకు చేరుకుంది. ఇకపోతే రీసెంట్ గా ఒక వీడియో తొలగించినందుకు యూ ట్యూబ్ కు ఢిల్లీ హై కోర్టు 9.5 లక్షల జరిమానా విధించింది. 2015లో దీనికి సంబందించిన కేసు నమోదైంది.

తనను కించపరిచే విధంగా ఒక వీడియో అప్లోడ్ కావడంతో దాన్ని తొలగించాలని కోరడంతో వీలుపడలేదు. దీంతో ఆ వైద్యుడు కోర్టును ఆశ్రయించడంతో గతంలోనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఆ వీడియో ఇంకా వైరల్ అవ్వడం వల్ల యూ ట్యూబ్ సాంకేతిక లోపల కారణంగా దాన్ని తొలగించలేకపోయామని వీడియోను మరెవరూ చూడకుండా డిసేబుల్ చేశామని కోర్టుకు తెలిపింది. అయితే కోర్టు యూ ట్యూబ్ ఆలస్యం చేసిన విషయంలో ఆ తప్పిదానికి వాదనను తిరస్కరించి రూ. 9.50 లక్షల జరిమానా విధించారు.

  •  
  •  
  •  
  •  

Comments