ఫీజు లాగిన స్కూల్స్ కు షాకిచ్చిన ఢిల్లీ.. ఆ డబ్బు పేరెంట్స్ కి ఇచ్చేయాలి!

Thursday, May 24th, 2018, 08:30:20 PM IST

ప్రస్తుత రోజుల్లో ప్రయివేట్ స్కూల్ లు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి. పిల్లలకు మంచి విద్యను అందివ్వాలని తల్లి దండ్రులు లక్షల్లో ఫీజులు కట్టడానికి రెడీ అవుతున్నారని కొత్త కొత్త పేర్లతో స్కూళ్ళు పుట్టుకొస్తున్నాయి. ఇక ఒక్కసారి పిల్లల్ని స్కూల్ లో జాయిన్ చేయిస్తే చాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పీజులు లాగడం మొదలు పెడుతున్నారు. అర్ధం లేని పేర్లు చెప్పి వేలకు వేలు దండుకుంటున్నారు. అయితే అలాంటి స్కూళ్లపై వేటు వేయాలని ఢిల్లీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

వేటు వేసేముందు వారికి ఒక్క అవకాశం ఇస్తూ.. 2016 నుంచి 2018 వరకు మధ్యలో అత్యధిక వసూళ్లు లాగిన ప్రయివేట్ పాఠశాలలు వెంటనే డబ్బును తిరిగిచ్చేయాలి. అది కూడా 9% వడ్డీతో కలిపి ఇవ్వాలని ఢిల్లీ గవర్నమెంట్ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది. దీంతో మధ్య తరగతి తల్లిదండ్రులుకు ఊరట లభించింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (డీవోఈ) నియమించిన కమిటీ అందించిన నివేదిక ప్రకారం డబ్బు వారం రోజుల్లోగా తల్లిదండ్రులకు చేరవేయాలని తెలిపారు. అలా చేయకుంటే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధిక ఫీజును రాబట్టిన పాటశాల వివరాలను వీలైనంత త్వరగా తెలుపాలని జిల్లాల డిప్యూటీ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్లను ఆదేశించింది.

  •  
  •  
  •  
  •  

Comments