అమర్ సింగ్ ను ప్రశ్నించనున్న సిట్!

Wednesday, January 28th, 2015, 04:13:30 PM IST


సంచలనం రేపుతున్న కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసులో సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అమర్ సింగ్ ను సిట్ ప్రశ్నించనుంది. కాగా ఈ మేరకు అమర్ సింగ్ ను మరియు సునంద కుమారుడికి కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ కోరింది. అయితే సునంద హత్య కేసును సీరియస్ గా తీసుకున్న ఢిల్లీ పోలీసులు సాధ్యమైనంత వరకు సునందతో పరిచయం ఉన్న ప్రతీ ఒక్కరినీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ నేపధ్యంగానే అమర్ సింగ్ ను, సునంద కుమారుడిని కూడా పోలీసులు త్వరలో ప్రశ్నించనున్నారు.

కాగా ఐపీఎల్ వివాదంలో సునంద పేరు తెరపైకి వచ్చినప్పుడు అమర్ సింగ్ ఆమెను సమర్ధించారు. అంతేకాకుండా సునంద తనకు మంచి స్నేహితురాలని అప్పట్లో అమర్ సింగ్ చెప్పుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇక ఇప్పటికే సునంద హత్యకేసులో ఆమె స్నేహితురాలు నళినీ సింగ్ ను, సునంద భర్త శశి థరూర్ ను ప్రశ్నించిన సిట్ అమర్ ను కూడా విచారించనుంది.