ఢిల్లీ కుట్ర రాజకీయాలు ఇక్కడ సాగవు…తెలుగు వారు మేల్కొనాలి : చంద్రబాబు

Wednesday, May 23rd, 2018, 12:25:50 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిన్న విశాఖ పట్నం ఆంధ్ర యూనివర్సిటీ లోని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో రెండవ ధర్మ పోరాట దీక్షలో పాల్గొన్నారు. వందలాదిగా సభకు తరలివచ్చిన ప్రజలకు తొలుత చంద్రభాను అభినందనలు తెలిపారు. కేంద్రం దేశచరిత్రలో ఏ రాష్ట్రానికి చేయనంత అన్యాయం మన రాష్ట్రానికి చేసిందని, కావున ఇప్పటినుండి అయినా ప్రతి తెలుగు దేశం కార్యకర్త, ప్రతి యువతీ, యువకులు, ప్రజలందరూ రాష్ట్రం కోసం సైనికుల్లా పనిచేయాలన్నారు. కేంద్రంలో అధికారం దక్కించుకున్న సమయంలో బిజెపి నేతలు, ప్రధాని మోడీ ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని అన్నారు. ఎన్నోసార్లు తాను ఈ విషయమై ఢిల్లీ కి వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. ఇక్కడేమో ఒక అవినీతి పార్టీ మరొక కీలుబొమ్మ పార్టీ యాత్రలు చేస్తూ టిడిపి పైన, తనపైన లేనిపోని నిందలు వేస్తున్నాయని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన బిజెపి నేతలు మనల్ని మరింత అణగదొక్కాలని చూస్తున్నారని, అటువంటి వారి కుట్రలను తిప్పికొట్టాలని, అందుకే ఢిల్లీ దాకా తెలిసేలా ధర్మ పోరాట దీక్షలు చేపట్టామని అన్నారు.

ఢిల్లీ కుట్రలు ఆంధ్రాలో సాగవని, ఇక్కడి తెలుగువారు తలచుకుంటే బిజెపి అడ్రస్ గల్లంతవుతుందని, ఈ విషయం ఆ పార్టీనేతలు గుర్తుపెట్టుకోవాలి అన్నారు. త్వరలోనే అన్ని ప్రధాన జిల్లాల్లోనూ దీక్షలు చేపట్టి ప్రజల్ని చైతన్య పరచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నారు. ఓ వైపు తాను రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఆలోంచిస్తుంటే రాష్ట్రానికి మద్దతు ఇవ్వకుండా బిజెపి చెప్పినట్లుగా ఆ రెండు పార్టీల వారు ఆడుతున్నారని మండిపడ్డారు. వేలకోట్ల రోపాయల అవినీతి సొమ్ముతో, ప్రతి శుక్రవారం కోర్ట్ కి హాజరయి వారి ముందు చేతులు కట్టుకు నిలబడి సంతకం పెట్టి వచ్చే ఒక అవినీతి వ్యక్తికి టీడీపీ ని విమర్శించే హక్కులేదని వైసిపి నేత జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరొకాయన బిజెపి చెప్పినట్లుగా మాట్లాడుతూ, వారు ఆంధిచిన స్క్రిప్ట్ చదువుతూ ఊరూరా యాత్రలు చేస్తూ తమపార్టీ పై లేనిపోని నిందలు వేస్తున్నారని జనసేన అధినేత పవన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయినా ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కర్ణాటకలో బిజెపికి గట్టిగా బుద్ధి చెప్పిన ప్రజలు త్వరలో ఇక్కడ కూడా మరింత గట్టిగా ఓటు ఆయుధంతో వారికి పెద్ద షాక్ ఇస్తారని చెప్పారు.

కాగా సభలో మోడీ నెల్లూరు, విశాఖ, తిరుపతి లలో చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీల వీడియోలను ప్రదర్శించారు. మోడీ ఆటలు ఇక్కడ సాగవని, బిజెపి నేతలు ఇకనైనా మనకు రావలసిన నిధులను విడుదల చేసి అమరావతి నిర్మాణానికి సహాయం చేసితీరాల్సిందే అని అయన గట్టిగ స్పష్టం చేశారు. నేను చేసే ఈ ధర్మ పోరాట దీక్ష బీజేపీ వంచన, అన్యాయానికి వ్యతిరేకంగా చేపట్టిందని, ఇప్పటికే బిజెపి నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని అన్నారు. ఇక నేడు బెంగళూరులో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నాని, ఈ సందర్భంగా రాష్ట్ర పరిస్థితులపై పలువురు ఇతర పార్టీల నాయకులతో చర్చిస్తానని, అవసరమైతే ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు కూడా తీసుకుని దగాకోరు బిజెపి పై మరింత గట్టిగా నిరసన గళాన్ని వినిపిద్దామని స్పష్టం చేసారు……..

  •  
  •  
  •  
  •  

Comments