తెలంగాణకు హోదాకై పెరుగుతున్న డిమాండ్!

Friday, July 27th, 2018, 02:10:32 AM IST

ఓవైపు దేశ రాజధాని నగరం ఢిల్లీలో ఏపీకి ప్రత్యేక హోదాకు సంబంధించి ఇప్పటికే రాజకీయవేడి రగులుతున్న విషయం తెలిసిందే. ఏపీకి హోదా విషయమై ఇటీవల ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంలో పలు ప్రాంతీయ పార్టీల మద్దతు ఇచ్చిన విషయం కూడా విదితమే. అంతే కాదు ఇటీవల కాంగ్రెస్ జాతీయ సమగ్ర సమావేశంలో కూడా ఆ పార్టీ నేతలు ఒకవేళ తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో కేంద్రం లో అధికారం చేపడితే ప్రత్యేక హోదా ఇస్తామని, ఇప్పటికే అక్కడి ప్రజలు పడుతున్న కష్టాలు తమకు తెలుసునని అన్నారు. అయితే ఆ విషయం అటుంచితే, మరోవైపు ఏపీకి హోదా ఇస్తే మాకు కూడా హోదా అమలుచేయవలసి ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితిలోని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కొద్దిరోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ, ఏపీకి హోదా ఇవ్వడంలో తమకు ఎటువంటి అభ్యన్తరం లేదని, అయితే ఒకవేళ వారికి హోదా కనుక ఇస్తే భారీ పరిశ్రమలన్నీ కూడా అక్కడికి తరలి పోతాయని,

తద్వారా ఇక్కడ కొంత సంక్షోభం ఏర్పడే ప్రమాదం వుందని, అందువల్లనే తాము కూడా హోదా కోరుతునట్లు అయన తెలిపారు. ఇక రాష్ట్రంలో గత ఎన్నికల సమయంలో చెప్పినట్లు కొత్త విద్య సంస్థల ఏర్పాటు ఏమాత్రం జరగలేదని, నేడు ఈ విషయమై తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేసారు. అయితే ఇప్పటికే ఈ విషయమై కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ ను కలిసి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుపై కూడా చర్చించడం జరిగిందని, అలానే కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ సహా పలువిద్య సంస్థల ఏర్పాటు త్వరితగతిన పూర్తిచేయాలని విన్నవించారట, అంతేకాక రాష్ట్రానికి హోదా ఇవ్వడం ద్వారా మరింత అభివృద్ధిని పొందగలమని ప్రకాష్ జవదేకర్ తో చెప్పినట్లు సమాచారం. తమ విజ్ఞప్తులను కేంద్ర మంత్రి ప్రధాని మోడీకి అలానే ఇతర సబ్యులకు వివరించి త్వరలోనే తగు నిర్ణయాలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు…..

  •  
  •  
  •  
  •  

Comments