కర్ణాటకలో ప్రజాస్వామ్యం గెలిచింది : ఏపీ సీఎం చంద్రబాబు

Sunday, May 20th, 2018, 10:53:05 AM IST

ఏపీ సీఎం చంద్రబాబు కర్ణాటక ఎన్నికలపై అక్కడి రాజకీయ పరిస్థితులపై స్పందించారు. ఓవైపు ఏపీ కి అన్యాయం చేసిన బిజెపి పార్టీ కర్ణాటకకు కూడా హస్తగతం చేసుకుని అవినీతి అక్రమార్జనలు చేద్దామని అనుకుందని, కానీ ప్రజా వాణి ముందు నిలువలేక మట్టికరించిందని ఆయన అన్నారు. ఆయన మాట్లాడుతూ అక్కడ ప్రజాస్వామ్యం విజయం సాధించిందని అన్నారు. అసలు ఏ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు సరైన మెజారిటీ లేకుండా గవర్నర్ యడ్యూరప్పను ఆహ్వానించడం, అలానే ఆయనని ముఖ్యమంత్రి స్థానంలో ప్రమాణం చేయించడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అయితే ఎట్టకేలకు సుప్రీమ్ కోర్ట్ ప్రజాస్వామ్యం రక్షించబడేలా తీర్పు ఇచ్చిందని తత్ఫలితంగా నిన్న యెడ్యూరప్ప బలిరూపంలో ఫెయిల్ అవడంతో ఆయన రాజీనామా చేసారని, ఇది ముమ్మాటికీ అక్కడి ప్రజల విజయమని ఆయన కొనియాడారు.

మేము ఎన్నడూ కర్ణాటకలో బిజెపి కి వ్యతిరేకంగా ఓటు వేయమని చెప్పలేదని, అయితే తెలుగు ప్రజలకు అన్యాయంచేసిన మోడీ నేతృత్వంలోని పార్టీలు ఏ రాష్ట్రాల్లో ఎన్నికైనా ఆ రాష్ట్రాల పరిస్థితి ఇలానే ఉంటుంది, కాబట్టి ప్రజలు ఒకసారి పునరాలోచించుకొని ఓటు వేయాలని సూచించినట్లు తెలిపారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి మోడీనే పక్క పార్టీ ఎమ్యెల్యేను ప్రలోభ పెట్టేలా తమ పార్టీ నేతలను ఉసి గొల్పుతున్నారని అన్నారు. ఒకవైపు అమిత్ షా, మరోవైపు గాలి జనార్ధన రెడ్డి వంటి వారిని ఎమ్యెల్యేలను ప్రలోభ పెట్టేందుకు రంగం లోకి దించారని మండిపడ్డారు. ఇది నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమని, కొందరు ఎమ్యెల్యేలని అయితే ఏకంగా మీ జీవితంలో సంపాదించినా దానికంటే 100 రేట్లు ఇస్తాము, అలానే మంత్రి పదవులు కూడా ఇస్తామని అనడం వారి పార్టీనేతల నీచత్వానికి నిదర్శనమని అన్నారు.

మన రాష్ట్ర అభివృద్ధికి మోడీని, బిజేపినేతలను ఎన్నిసార్లు కలిసిన ఉపయోగం లేకుండా పోయిందని, ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి బీజేపీ కుట్రని గ్రహించాలన్నారు. ఇక్కడి బిజెపి నేతలేమో మా పై, మా పార్టీ నేతలపై రాష్ట్రానికి అన్నీ ఇచ్చాము అంటూ అబద్దపు మాటలతో మా మీద నిందలు మోపుతున్నారని, అదేమిటని ప్రశ్నిస్తే తమనేతలను ఏకవచనంతో సంబోధిస్తూ తిడుతున్నారని, ఇది ఎంతమాత్రమూ మంచిచర్య కాదని అన్నారు. ఏపీకి అన్యాయం చేయాలని చూసారు కాబట్టే కన్నడ ప్రజలు అక్కడ మంచి గుణపాఠం చెప్పారని, రానున్న రోజుల్లో ఆ పార్టీకి మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయని అన్నారు. రాష్ట్రంలో తమను తమ పార్టీని అణిచివేయాలని చూసేవారిపట్ల తాను కూడా గట్టిగా వ్యవహరించనున్నట్లు చెప్పారు……

  •  
  •  
  •  
  •  

Comments