కరెన్సీ కష్టాలు తగ్గించే మరో న్యూస్..!

Sunday, November 27th, 2016, 12:01:17 AM IST

2000
కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లని రద్దు చేసిన తరువాత ప్రజలు నగదు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏటీఎం ల వద్ద పెద్ద క్యూలు ఉంటుంది నేపథ్యం లో పెట్రోల్ బంకులు, బిగ్ బజార్ ల వద్ద డెబిట్ కార్డు స్వైప్ చేసి రూ 2000 తీసుకునే అవకాశం కల్పించగా ఇప్పుడు తాజాగా ఐనాక్స్ లలో కూడా కార్డు స్వైప్ చేసి రూ 2000 పొందే అవకాశాన్ని కల్పించారు. కరెన్సీ కొరత తో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యం లో బిగ్ బజార్, ఐనాక్స్ థియోటర్ లు ఆఫర్లతో ముందుకు వచ్చాయి.

ఈ రెండు సంస్థలతో తాము ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎస్బిఐ ఉన్నతాధికారి ఒకరు నిర్ధారించారు. దీనితో ప్రజలకు మరింత సులువుగా కరెన్సీ నోట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అన్నారు. శుక్రవారం సాయంత్రం నుంచే ముంబై లోని ఐనాక్స్ లలో ప్రజలకు డబ్బులు ఇస్తున్నారు.దీనివలన ప్రజలుపడుతున్న కరెన్సీ ఇబ్బందులను కొంతవరకైనా తీర్చేందుకు వీలు ఉంటుందని అంటున్నారు.