డేరా వ్యతిరేకులను చెంపేస్తాం.. 200 మంది రెడీగా ఉన్నారు

Thursday, September 28th, 2017, 09:00:00 AM IST

దేశంలో సంచలనం సృష్టించిన డేరా బాబా వివాదం రోజుకో మలుపు తీరుగుతోంది. నేరం రుజువయ్యాక కోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఆ తర్వాత డేరా అసలు విషయాలు చాలా వరకు బయటపడ్డాయి. నేరాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మొన్నటి వరకు డేరా బాబాను దైవంలా కొలిచిన జనాలు కూడా ఇప్పుడు అతని పేరెత్తడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే ఎవరు ఊహించని విధంగా డేరా ఖుర్బానీ విభాగం ఒక హెచ్చరికను జారీ చేసింది.

ఇప్పటివరకు డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీం సింగ్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చంపేస్తామని లేఖ ద్వారా తెలిపారు. ముఖ్యంగా విలేకరులను అలాగే హర్యానా పోలీస్‌ అధికారులతో పాటు డేరా మాజీ అనుచరులను చంపేస్తామని డేరా ఖుర్బానీ విభాగం హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా మళ్లీ ఆ వివాదం తార స్థాయికి చేరినట్లయింది. ఎందుకంటే ఆ దాడి చేయడానికి 200 మంది సిద్ధంగా ఉన్నారట. వారందరు ఆత్మహత్యకు రెడీ ఉన్నవారిని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖను పలు మీడియా సంస్థలకు అందింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు చండి ఘర్ లో కట్టుదిట్టమైన నిఘాను ఏర్పాటు చేశారు.

  •  
  •  
  •  
  •  

Comments