వీడియో : హాలీవుడ్ రేంజ్ లో ఏపీ అసెంబ్లీ, సచివాలయం

Friday, December 1st, 2017, 01:42:33 PM IST

ఎలాగైనా వచ్చే ఎలక్షన్స్ లోపు ఏపీ రాజధాని నిర్మాణ పనులు వీలైనంత వరకు పూర్తి చెయ్యాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కష్టపడుతున్నారు. ఇప్పటికే పనులు ఆలస్యం అవుతున్నాయని ప్రతి పక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా కూడా చంద్రబాబు ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తూ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్నారు. అయితే రీసెంట్ గా ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన డిజైన్లను చంద్రబాబు ఫైనల్ చేశారు.

గత కొంత కాలంగా కొన్ని డిజైన్స్ కోసం అన్వేషణ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా అసెంబ్లీ, సచివాలయం భవనాల ఆకృతి ఎలా ఉంటుందో ఒక వీడియో ద్వారా చూపించేశారు. భవంతులు హైరైజ్ బిల్డింగ్ ల రూపంలో ఉంటాయి. లండన్ లో క్రియేట్ చేసిన ఈ డిజైన్లను ఫాస్టర్ అండ్ పార్టనర్స్ ఏపీ ప్రభుత్వానికి అందించింది. అంతే కాకుండా డిజైన్లను సీఆర్డీయే వెబ్ సైట్ లో ఉంచారు. ఇక ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

  •  
  •  
  •  
  •  

Comments