మూవీ రివ్యూ : దేవ్

Thursday, February 14th, 2019, 01:19:07 PM IST

తమిళ్ స్టార్ హీరోల్లో మన తెలుగులో మంచి ఆదరణ ఉన్న హీరోల్లో కార్తీ కూడా ఒకరు.కార్తీ సినిమాలు మన దగ్గర కూడా బాగానే చూస్తారు,కానీ ఆ మధ్య అంతా సరైన హిట్ తగలలేదు అప్పుడు రకుల్ మరియు,కార్తీ జంటగా వచ్చిన “ఖాకీ” మంచి విజయం సాధించింది.ఇప్పుడు మళ్ళీ ఈ హిట్ కాంబినేషన్లోనే రజత్ రవిశంకర్ మొట్టమొదటి సారి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్,లవ్ మరియు అడ్వెంచర్ చిత్రం “దేవ్”,ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది,మరి ఈ చిత్రం ఎంత వరకు విజయం సాధించిందో రివ్యూ లోకి వెళ్లి తెలుసుకుందాం రండి..

కథ :

కథలోకి వెళ్లినట్టయితే హీరో కార్తీ(దేవ్) కి చిన్నప్పటి నుంచి అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం.అందుకోసమే తన స్నేహితులతో కలిసి అడ్వెంచర్స్ చేస్తుంటాడు.అలాగే ఒక సందర్భంలో యువ ప్రారిశ్రామిక వేత్త అయినటువంటి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్(మేఘన) ను చూసి ప్రేమలో పడెయ్యాలనుకుంటాడు,కానీ ఆమె అందుకు ఒప్పుకోదు ఆ తర్వాత దేవ్ తన ప్రేమని గెలిపించుకున్నాడా? ఆ సమయంలో అతను చేసిన అడ్వెంచురస్ ఎపిసోడ్స్ ఏమన్నా ఉన్నాయా?ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ సినిమా మొదలవ్వడమే ఒక అడ్వెంచర్స్ షాట్ తో మొదలవుతుంది.అడ్వెంచర్ అంటే ఇష్టమున్న యువకునిగా అలాగే లవర్ బాయ్ గా కార్తీ మంచి స్టైలిష్ గా కనిపిస్తారు.మంచి నటన కనబర్చారు.అలాగే కార్తీ తండ్రిగా ప్రకాష్ రాజ్ ఎప్పటిలానే అద్భుత నటన కనబర్చారు,వీరిద్దరి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు బాగుంటాయి,ఇక అలాగే రకుల్ యువ పారిశ్రామిక వేత్తగా మరో పక్క తన గ్లామర్ తో ఆకట్టుకుంటారు,అక్కడక్కడా కొన్ని హాస్య సన్నివేశాలు మినహా పెద్ద గొప్పగా ఏమి అనిపించదు.ఇక ఈ సినిమాలో నటించిన సీనియర్ నటులు ప్రకాష్ రాజ్ మరియు రమ్య కృష్ణ తమ పాత్రలకి సరైన న్యాయం చేకూర్చారు.

ఇక అలాగే హ్యారిస్ జైరాజ్ సంగీతం కోసం కొత్తగా చెప్పేది ఏముంది,తన మార్క్ సంగీతంతో హమ్మింగ్ ట్యూన్స్ తో మరోసారి ఆకట్టుకున్నారు.ఈ సినిమాలో కార్తీ చేసే కొన్ని అడ్వెంచురస్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.ఇక దర్శకుని పని తీరుకి వచ్చినట్టయితే రజత్ రవిశంకర్ రాసుకున్న స్క్రిప్ట్ అడ్వెంచర్స్ తో కూడిన లవ్ స్టోరీ పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి,రవి శంకర్ కు ఇది మొదటి సినిమాయే అయినా టేకింగ్ మాత్రం బాగుంది.

కానీ తాను అనుకున్న కథని వెండితెరపై చూసే ప్రేక్షకుడికి ఏ మాత్రం పెద్దగా ఆసక్తికరంగా అనిపించదు,అక్కడక్కడా కొన్ని సీన్లు తప్ప సినిమాలో పెద్దగా చెప్పుకోడానికి ఏమి ఉండదు.మరి కొన్ని సీన్లు అయితే వాటిని ప్రేక్షకుడు ముందే అంచనా వేసేస్తాడు,రజత్ తాను తీసుకున్న హీరో రోల్ ఇంకాస్త ఆసక్తికరంగా మలచి ఉంటే బాగుండేది.అలాగే సినిమాకి ఇచ్చిన ముగింపు కూడా ప్రేక్షకులని పెద్దగా ఆకట్టుకోదు,దీనిపై దర్శకుడు మరింత శ్రద్ధ వహించి ఉండాల్సింది.

ప్లస్ పాయింట్స్ :

కార్తీ,రకుల్ ల మధ్య కెమిస్ట్రీ
కొన్ని అడ్వెంచురస్ సన్నివేశాలు
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్
విజువల్స్

మైనస్ పాయింట్స్ :

కథ
పాటలు
కొన్ని సీన్లు ముందే అంచనా వేసేయ్యోచ్చు.

తీర్పు :

ఇక మొత్తానికి చూసుకున్నట్టయితే అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో దేవ్ తెరకెక్కిన “దేవ్” సినిమా పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి,అక్కడక్కడా కొన్ని సీన్లు మినహాయించి మిగతా సినిమా అంతా తేలిపోతుంది.రజత్ రవి శంకర్ కు ఇది మొదటి సినిమా కావడం వల్ల ఇంకాస్త ఎక్కువ శ్రద్ధ వహించి తెరకెక్కించి ఉంటే బాగున్ను.అలాగే సినిమాలకు ఎంతో కీలకమైన క్లైమాక్స్ ను కూడా ఆసక్తికరంగా మలచడంలో దర్శకుని వైఫల్యాన్ని గమనించొచ్చు.ఈ వారాంతానికి ఈ సినిమాని ఒక్కసారి చూడొచ్చు.

Rating : 2.5/5

4 & Above – Must Watch
3.5 – Hit
3 – Average
2.5 – Below Average
2 & Below – Stay Away

REVIEW OVERVIEW
Dev Movie Movie Review in Telugu